ఓలా క్యాబ్ డ్రైవర్ ఘాతుకం: కారు లాక్ చేసి యువతిపై వేధింపులకు దిగాడు
Recommended Video

బెంగళూరు: మహిళా ప్రయాణికులపై క్యాబ్ డ్రైవర్ల ఘాతుకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళతో ఓలా క్యాబ్ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన 23ఏళ్ల యువతి ఇంటికి వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకుంది. అయితే.. కొద్ది దూరం వెళ్లాక నిర్మానుష్య ప్రదేశంలో కారును డ్రైవర్ రోడ్డు పక్కన ఆపి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె గట్టిగా అరుస్తూ కాపాడమని కేకలు వేయడంతో కారు డోర్‌ను లాక్ చేశాడు.
అతడిని ప్రతిఘటిస్తూనే.. బాధిత యువతి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసింది. కొద్ది సేపటికి డ్రైవర్ కారు డోర్‌ను తీసేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
'క్యాబ్ డ్రైవర్ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో నేను గట్టిగా కేకలు వేశాను. అతడు కారు డోర్ లాక్ చేశాడు. కారు విండోస్‌ను పదే పదే కొడుతూ గట్టిగా కేకలు వేస్తుండటంతో అతడు భయపడి కారును వదిలేసి పారిపోయాడు. నేను వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను' అని బాధిత యువతి తెలిపింది.
కాగా, యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన డ్రైవర్‌ను ఓలా తొలగించింది. అతడిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications