వైరల్ వీడియో: బెంగళూరులో ఏం జరుగుతోంది..? నడి రోడ్డుపై..
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ లోని పలువురు యూట్యూబర్ లు పాకిస్థాన్ కు సపోర్ట్ గా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వారిపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పదుల సంఖ్యలో యూట్యూబర్ లను అరెస్ట్ చేసింది. అయితే తాజాగా బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన జరిగింది. మెట్రోపాలిటన్ సిటీగా పేరొందిన బెంగళూరులో ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం దేశం నలుమూలల నుంచి అనేక మంది వస్తుంటారు.
What's happening in Bengaluru?
— Nishkama_Karma (@Nishkama_Karma1) September 24, 2025
Take immediate necessary action @DgpKarnataka@BlrCityPolice@CPBlrpic.twitter.com/HReCOyLhtb https://t.co/0QrWkVknRt
అయితే బెంగళూరులో జమ్ము కాశ్మీర్ లోని పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) కు చెందిన రిజిస్ట్రేషన్ వాహనం ప్రత్యక్షమైంది. అంతేకాక ఓ వ్యక్తి POK జెండా కలిగిన టీ షర్టు ధరించి రోడ్లపై హల్ చల్ చేశాడు. ఆ వ్యక్తి ధరించిన టి షర్టు వెనక POK జెండా కలిగి ఉంది. ఇది ఆజాద్ పాకిస్థాన్ ను సూచిస్తుంది. ఇలాంటివి భారత్ లో ప్రదర్శించడం నిషేధం. కానీ ఇక్కడ రోడ్లమీద ఇలాంటి వాటిని ప్రదర్శిస్తూ దేశ భద్రతకు విఘాతం కలిగిస్తున్నారు. ఈ దృశ్యాలను నిష్కమ కర్మ అనే ఎక్స్ అకౌంట్ కలిగిన వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.

'భారత్ లో ఇలా బహిరంగంగానే కొంతమంది దేశంపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. ఇది సెపరేటిజమ్ సీడ్స్ ను పెంచుతుంది. ఇది వరకే ఇలాంటి వాటిపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. అయినా ఆగడం లేదు. తక్షణమే వీళ్లపై చర్యలు తీసుకోవాలని' కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు నిష్కమ కర్మ. ఈ మేరకు కర్ణాటక డీజీపీ, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, సీఎం కు వీడియోను ట్యాగ్ చేశారు. ఈ వీడియోపై నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని.. బెంగళూరులో పాకిస్థానీలు నిండిపోయారని మరొకరు కామెంట్స్ పెట్టారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications