ఎంతైనా బెంగళూరోళ్ల తెలివి అతి
బెంగళూరులో ఓ బైక్ పైన కూర్చున్న వ్యక్తి హెల్మెట్‌కు బదులుగా 'కడాయి' ని ఉపయోగించిన ఉదంతం ఇది. దీన్ని తలపై ధరించి ప్రయాణిస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బెంగళూరు రూపేణ అగ్రహారలో కనిపించిన సీన్ ఇది. నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే ప్రాంతం ఇది. మడివాళ లేక్ కు దగ్గరలో ఉంటుంది. ఎలక్ట్రానిక్ సిటీ మెయిన్ రోడ్ ను కనెక్ట్ చేస్తుంది. చెన్నై వైపు వెళ్లే హైవే కావడం వల్ల అన్నివేళల్లోనూ హెవీ ట్రాఫిక్ ఉంటుందిక్కడ.
బెంగళూరులో బైకర్ తో పాటు వెనుక కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి. లేకపోతే ఫైన్ తప్పదు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు బండిని ఆపేస్తారు. లైసెన్స్ దగ్గర నుంచి అన్నింటి గురించీ ఆరా తీయడం మొదలు పెడతారు. ఈ ఇబ్బందిని తప్పించుకోవడానికి బైక్ వెనుక కూర్చున్న ఓ యువకుడు.. తన చేతిలో ఉన్న కడాయిని హెల్మెట్ గా అమర్చుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. హెల్మెట్ ఉందనే నమ్మించేలా దాన్ని కడాయితో తలను దాచుకుంటూ నానా తిప్పలు పడ్డాడు.

కర్ణాటక పోర్ట్ ఫోలియో అనే ఎక్స్ హ్యాండిల్ లో ఈ వీడియోను పోస్ట్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ జరుగుతోంది. కర్ణాటక పోర్ట్‌ఫోలియో హ్యాండిల్ దీన్ని పీక్ బెంగళూరు మూమెంట్ గా అభివర్ణించింది. "ఫ్రైయింగ్ పాన్ ఆమ్లెట్ వేసుకోవడానికి మాత్రమే.. మీ తలను, ట్రాఫిక్ ఫైన్ల నుంచీ కాపాడలేదు" అని చమత్కరించింది. హెల్మెట్లు ప్రాణాలను రక్షించడానకే తప్ప వైరల్ రీల్స్‌కి పనికిరావనీ కామెంట్స్ పోస్ట్ చేసింది.
కొంతమంది నెటిజన్లు ఈ వీడియోను లైట్ గా తీసుకున్నారు. హెల్మెట్‌లు కేవలం ఫ్యాషన్ వస్తువులు కావు. అవి ప్రాణాలను కాపాడే సాధనాలు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఇలాంటి 'జుగాడ్' పనులు పక్కనపెట్టి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫ్రైయింగ్ ప్యాన్‌ను వంటగదిలో ఉంచండి, మీ తలపైన కాదు అని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Peak Bengaluru moment! In a scene straight out of a comedy sketch, a pillion rider near Roopena Agrahara was spotted trying to escape a traffic challan by covering his head with wait for it a frying pan instead of a helmet.Yes, a frying pan. Because apparently, when life gives… pic.twitter.com/jhFWCTrvKi
— Karnataka Portfolio (@karnatakaportf) November 1, 2025
"ఇన్నోవేషన్ అట్ ఇట్స్ బెస్ట్" అని వ్యాఖ్యానించారు. మరొకరు చలాన్ కట్టాల్సొచ్చినప్పుడు కడాయిని ఇలాక్కూడా వాడొచ్చన్నమాట అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వీడియో బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. వారు దీన్ని ఎలక్ట్రానిక్ సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు రీట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications