బొక్కలో బెంగళూరు పోలీసులు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు, ఫ్రై చేసిన మామలు!

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో (Bengaluru) ఓ కాలంలో రౌడీషీటర్లు రెచ్చిపోయేవాళ్లు. ఇప్పటికి బెంగళూరులోని కొన్ని ప్రాంతాల పేరు చెబితో సామాన్య ప్రజలు ఉలిక్కిపడుతుంటారు. బెంగళూరు (Bengaluru) నగరంలో దాదాపుగా పేరుమోసిన రౌడీషీటర్ల (rowdy sheeter) అంతు చేసిన పోలీసులు రౌడీయిజం అణచివేశారు. అయితే ఓకాలం రౌడీషీటర్ల పేర్లు చెప్పుకుని ఇంకా అక్కడక్కడా రౌడీలు దందాలు చేస్తూనే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయిజ

ఐటీ హబ్ బెంగళూరులో (Bengaluru) కొన్ని ప్రాంతాల్లో రౌడీషీటర్లకు చెంచాలుగా పని చేస్తూ మూతిమీద కనీసం మీసాలు కూడా రాని కొందరు యువకులు చిన్నిచిన్న నేరాలు చేసి జైలుకు వచ్చి ఇప్పుడు నేనేరా రౌడీ అంటూ ఫోజులు కొడుతున్నారు. పోలీసు తూటాల రుచిచూసినా ఓ యువకుడికి తిమిరి ఏమాత్రం తగ్గడం లేదని మరోసారి వెలుగూ చూసింది.

Bengaluru police arrested a rowdy sheeter who was posting videos on social media insulting the police

చేతిలో మారణాయుధాలు పెట్టుకుని పోలీసుల ముందే సిగరెట్లు తాగుతూ ఇన్ స్ట్రా రీల్స్ చేస్తున్న రౌడీని (rowdy sheeter)మరోసారిసారి అరెస్టు చేసి ఎత్తి జైల్లో వేశారు. ఓ రౌడీషీటర్ చేతులు పట్టుకుని సిగరెట్ తాగుతూ రీల్ చేసి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో (social media) పోస్టు చెయ్యడంతో అది వైరల్‌గా మారింది. గతంలో ఓ హత్యాయత్నం కేసులో పోలీసులకు దమ్ము దైర్యం ఉంటే తనను పట్టుకోవాలి అంటూ సవాలు చేస్తూ వీడియో తీసిన రౌడీషీటర్ (rowdy sheeter) రాహుల్ అలియాస్ స్టార్ రాహుల్ దానిని సోషల్ మీడియాలో (social media) పోస్టు చెయ్యడం కలకలం రేపింది.

ఇప్పుడు అదే రౌడీషీటర్ (rowdy sheeter) రాహుల్ సిగరెట్ తాగుతూ రీ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. చేతిలో మారణాయుదాలు తిప్పుతూ పోలీసులు దగ్గరగా నిలబడి ఉన్న సమయంలో రౌడీషీటర్ రాహుల్ సిగరేట్ తాగుతూ రీల్ వీడియో చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరు (Bengaluru) నగరంలోని

సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ గా ఉన్న రాహుల్ పేరుమోసిన రౌడీ కుల్లా రిజ్వాన్ కు సహచరుడు.

హత్య, హత్యాయత్నం, దోపిడీ, దౌర్జన్యం, దోపిడీలతో పాటు పలు కేసులు నగరంలోని పలు పోలీస్‌స్టేషన్లలో రౌడీషీటర్ (rowdy sheeter) రాహుల్ మీద నమోదు అయ్యాయి. నేను ఇంకా రౌడీయిజం చేస్తున్నానని రాహుల్ ఆ వీడియోలు చెబుతూ పోలీసులను అనరాని మాటలతో దుర్భాషలాడాడు. గతేడాది రౌడీ రాహుల్‌ను గంజాయి కేసులో అరెస్టు (arrest) చెయ్యడానికి పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో పోలీసుల మీద రాహుల్ దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి, ఆ సందర్బంలో పోలీసులు రాహుల్ కాలిలోకి తుపాకీతో కాల్చి అతన్ని అరెస్టు చేశారు.

అంతకుముందు రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ బెంగళూరు (Bengaluru)సీసీబీ పోలీసులు, బెంగళూరు సౌత్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, అయినా నేను వాళ్లకు దొరకనని, మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్యాలని పోలీసులకే చాలెంజ్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు. పేరుమోసిన రౌడీ (rowdy sheeter) బేకరీ రఘును కూడా తాను చంపేస్తానని వీడియోలో చెప్పాడు. పోలీసులను అనరాని మాటలతో దుర్భాషలాడాడు. అయితే రాహుల్ గ్రహాలు పూర్తిగా రివర్స్ కావడంతో అతన్ని పోలీసులు మరోసారి అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+