బెంగళూరు పోలీస్ ఎమర్జెన్సీ వాట్పాప్ నెంబర్ ఇదే
బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ కన్నడ సంఘాలు చేపట్టిన ఆందోళనలతో బెంగళూరు నగరం అట్టుడికిపోతుంది. బెంగళూరులోని 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫూ అమలులో ఉంది.
ఈ నేపధ్యంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే ఎమర్జెన్సీ వాట్స్ ప్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ మేఘరికర్ మనవి చేశారు. బెంగళూరు ప్రజల సమస్యలు తీర్చడానికి వాట్సాప్ నెంబర్ 9480801000 కేటాయించారు.

బెంగళూరు నగర ప్రజలు ఇబ్బందికి గురైతే వెంటనే వాట్సాప్ లో సమాచారం ఇస్తే స్థానిక పోలీసులను పంపించి వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు.
సామాన్య ప్రజల వాహనాలు, ఆస్తులకు హాని కలిగించినా, వారిని ఇబ్బందులకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ మేఘరికర్ హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎవరినైనా సరే వదిలిపెట్టమని పోలీసు అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications