ఓరి పాపాత్ముడా! క్లాస్ చెప్తానని ఇంటికి పిలిచి ఏంట్రా నువ్వు చేసిన పని..
బెంగళూరులోని ఓ ప్రముఖ ప్రైవేట్ కాలేజీలో బీసీఏ విద్యార్థిని పట్ల ఓ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఆరోపణలపై అతను అరెస్టు అయ్యాడు. అతని పేరు సంజీవ్ కుమార్ మండల్. టీచింగ్, మార్కులు, అటెండెన్స్ విషయంలో సహాయం చేస్తానని ఆశచూపి ఆ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు అతనిపై ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల మేరకు సంజీవ్ కుమార్ ను అరెస్ట్ చేశారు.
దీనికి సంబంధించిన వివరాలను తిలక్‌నగర్ పోలీసులు వెల్లడించారు. పోలీసుల ఇచ్చిన సమాచారం ప్రకారం.. సంజీవ్ కుమార్ మండల్ ఓ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తోన్నాడు. హెచ్ఓడీగా వ్యవహరిస్తోన్నాడు. తన క్లాస్ కు చెందిన ఓ బీసీఏ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తాను బోధించే సబ్జెక్ట్‌లో వీక్ గా ఉందని, అలాగే అటెండెన్స్ తక్కువగా ఉందని, ఇంప్రూవ్ మెంట్ కోసం సహాయం చేస్తానని చెప్పి తిలక్ నగర్ లోని తన ఇంటికి పిలిపించాడు.

ఆ విద్యార్థిని గానీ, ఆమె తల్లిదండ్రులు గానీ ఇందులో ఒప్పుకోలేదు. తన భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారని, ఆమెకు ఎటువంటి ఉండదని ఆమె తల్లితో చెప్పాడు. అటెండెన్స్ తక్కువగా ఉందని, కాలేజీ అసైన్‌మెంట్లు పూర్తి చేయడానికి, డౌట్స్ తీర్చడానికి సహాయపడతానని నమ్మించాడు. తన ఫ్లాట్ దగ్గరలో గల పీజీలో వసతిని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఆమె తల్లిదండ్రులను ఒప్పించాడు. ప్రొఫెసర్ ఇచ్చిన హామీని నమ్మి, ఆమె తల్లి ప్రొఫెసర్ ఇంటికి వెళ్లమని కూతురితో చెప్పింది.
ఇంటికి వెళ్లి చూస్తే.. అతను చెప్పిందంతా రివర్స్ గా కనిపించింది. అతని భార్య, పిల్లలు ఇంట్లో లేరు. ఊరికి వెళ్లారని చెప్పాడు. సోఫాలో ఆమె పక్కన కూర్చుని వ్యక్తిగత వివరాలు అడగడం మొదలుపెట్టాడు. లైంగికంగా వేధించాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన విద్యార్థిని అక్కడి నుంచి ఎలాగోలా బయటపడింది.
తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది. వెంటనే వాళ్లు తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సెప్టెంబర్ 25వ తేదీన సంజీవ్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయంలో తెలిసిన వెంటనే అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతనిపై నిఘా ఉంచిన పోలీసులు సీసీటీవీలో అతని వాహన రాకపోకలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా అతని కదలికలను గుర్తించి, అరెస్టు చేశారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications