కన్నడ హీరోకు దేహశుద్ది.. నడి రోడ్డులో పెళ్లి చేసుకోవాలని యువతికి వేధింపులు!

బెంగళూరు: కన్నడ హీరో, నిర్మాత, దర్శకుడు హుచ్చ వెంకట్ (పిచ్చి వెంకట్)కు నిజంగానే పిచ్చి పట్టినట్లు ఉంది. మడికేరిలో ఇటీవల నడిరోడ్డులో నిలిపి ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేసి నానా హంగామా చేసి స్థానికుల చేతిలో తన్నులు తిన్న హుచ్చ వెంకటే తీరు ఇప్పటికీ మారలేదు. నడిరోడ్డులో కాలేజ్ కు వెళ్లడానికి బస్సు కోసం వేచి ఉన్న యువతిని తనను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని నానా రాద్దాంతం చేశాడు. అడ్డు వచ్చిన స్థానికులతో దురుసుగా ప్రవర్తించి వారి చేత మరోసారి తన్నులు తిన్న హుచ్చ వెంకట్ ను పోలీసులు అరెస్టు చేశారు.

హిందూపురం టోల్ గేట్ రోడ్డు

హిందూపురం టోల్ గేట్ రోడ్డు

శుక్రవారం (అక్టోబర్ 4వ తేదీ) బెంగళూరు- హిందూపురం (ఆంధ్రప్రదేశ్) రోడ్డులోని రాజనకుంట సమీపంలోని హరదేనహళ్ళి టోల్ గేట్ సమీపంలో ఓ అమ్మాయి కాలేజ్ వెళ్లడానికి బస్సు కోసం వేచి ఉంది. అదే సమయంలో అటు వైపు వెళ్లిన హుచ్చ వెంకటే కారు నిలిపాడు.

నేను సినిమా హీరో

నేను సినిమా హీరో

నేరుగా అమ్మాయి దగ్గరకు వెళ్లిన హుచ్చ వెంకట్ ఆమె, పేరు వివరాలు తెలుసుకున్నాడు. తరువాత తాను సినీ హీరో హుచ్చ వెంకట్ అని చెప్పడంతో ఆమె తనకు మీరు తెలుసు, చాలా సార్లు సినిమాల్లో, టీవీలో చూశానని సమాధానం ఇచ్చింది.

నన్ను పెళ్లి చేసుకో

నన్ను పెళ్లి చేసుకో

అంతే హుచ్చ వెంకట్ అసలు స్వరూపం బయటపెట్టాడు. తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని, ఇద్దరు కలిసి హాయిగా జీవించాలని యువతిని నడిరోడ్డులో ఇబ్బంది పెట్టాడు. హుచ్చ వెంకట్ ను చూసిన యువతి భయం భయంగానే అతనితో మాట్లాడింది.

పెళ్లి చేసుకోను

పెళ్లి చేసుకోను

తాను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేనని, తల్లిదండ్రులు చెప్పిన చోట పెళ్లి చేసుకుంటానని యువతి సమాధానం ఇచ్చింది. అంతే హుచ్చ వెంకట్ పిచ్చి తలకు ఎక్కింది. పక్కనే నిలిపి ఉన్న కారు అద్దాలు, కిటికీలు ధ్వంసం చేసిన హుచ్చ వెంకటే తనకు ఏమి తక్కువ, వెంటనే పెళ్లి చేసుకో అంటూ యువతిని భయాందోళనకు గురి చేశాడు.

హీరోను చితకబాదిన స్థానికులు

హీరోను చితకబాదిన స్థానికులు

ఆందోళనకు గురైన యువతి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. విషయం గుర్తించిన స్థానికులు హుచ్చ వెంకట్ కు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అయితే హుచ్చ వెంకట్ రెచ్చిపోవడంతో స్థానికులు అతనికి దేహశుద్ది చేసి రాజనకుంటే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజనకుంటే పోలీసులు హుచ్చ వెంకట్ ను అదుపులోకి తీసుని అతని కారును స్వాధీనం చేసుకున్నారు.

చెన్నైలో ముష్టి ఎత్తుకుని !

చెన్నైలో ముష్టి ఎత్తుకుని !

ఇటీవల హుచ్చ వెంకట్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం, ఎవ్వరికి చెప్పకుండా చెన్నై వెళ్లి పోయి రోడ్ల మీద చెప్పులు కూడా లేకుండా తిరగడం, ముష్టి ఎత్తుకోవడంతో కొందరు అతన్ని గుర్తించి బెంగళూరలోని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు నుంచి వెళ్లి కొందరు స్యాండిల్ వుడ్ ప్రముఖులు హుచ్చ వెంకట్ ను బెంగళూరు తీసుకు వచ్చారు. అయినా హుచ్చ వెంకట్ తీరు మారలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+