వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్: నిందితుడి వద్ద రేప్ వీడియో, అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూర్: పబ్లిక్ స్కూల్లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు ఆదివారంనాడు స్కేటింగ్ ఇన్‌స్ట్రక్టర్‌ను అరెస్టు చేశారు. కర్ణాటక రాజధాని బెంగుళూర్‌లో అత్యాచారం సంఘటనపై ప్రజల నుంచి ఆగ్రహం పెల్లుబుకిన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. ఆరేళ్ల బాలికపై పాఠశాల ఆవరణలో అత్యాచారం జరగడం తీవ్ర సంచలనం కలిగించింది.

కేసులో అనుమానంతో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత పాఠశాల స్కేటింగ్ ఇన్‌స్పెక్టర్ ముస్తాఫాను అరెస్టు చేసినట్లు బెంగళూర్ పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. 31 ఏళ్ల ముస్తఫా ఈ కేసులో ప్రధాన నిందితుడు.

Bengaluru rape case: Laptop of arrested skating instructor allegedly had rape videos

ముస్తఫాను అరెస్టు చేసిన విషయాన్ని ప్రకటిస్తూ మరిన్ని అరెస్టులు జరుగుతాయని ఎసిపి (క్రైమ్) ప్రణబ్ మొహంతి చెప్పారు. ఈ దారుణమైన ఘటనలో ఇది మొదటి అరెస్టు. జులై 2వ తేదీన బాలికపై అత్యాచారం జరిగింది.

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జులై 14వ తేదీన సంఘటన వెలుగు చూసింది. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌లో అశ్లీల చిత్రాలు ఉన్నట్లు ఔరాద్కర్ చెప్పారు. ముస్తఫా బీహార్‌లోని దర్భంగాకు చెందినవాడు. గత 20 ఏళ్లుగా బెంగళూర్‌లో ఉంటున్నాడు.

English summary
Facing public anger, the police on Sunday arrested a skating instructor in connection with the alleged rape of a six-year-old girl at a public school, six days after the outrageous incident was brought to light.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X