బెంగళూరులో హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు, సమయం, ధరలు ఇవే, ట్రాఫిక్ సమస్యకు చెక్!
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు ఈనెల చివరిలో ప్రారంభం కానున్నాయి. బెంగళూరు దక్షిణ, తూర్పు భాగాల నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రం వెళ్లాలనుకునే వారికి ఇది ఒక శుభవార్త. హెలికాప్టర్ ట్యాక్సీలు సంచరిచే సమయం, టిక్కెట్ ధరలు వెల్లడించారు.

ఎయిర్ పోర్టుకు 15 నిమిషాల్లో!
నిత్యం ట్రాఫిక్ సమస్యలతో కొన్ని గంటల ముందు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరకు బయలుదేరే ప్రయాణికులు ఇక ముందు ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి అవకాశం వచ్చింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి కేవలం 15 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది.

సర్వం సిద్దం
ఇప్పటికే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రంలో హెలిప్యాడ్ లు నిర్మించారు. ఎలక్ట్రానిక్ సిటీలో హెలిప్యాడ్ ల నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. ఇక రెండు ప్రాంతాలకు హెలికాప్టర్ ట్యాక్సీలు సంచరించడానికి సర్వం సిద్దం చేశారు.

ఉదయం, సాయంత్రం
బెల్ 407 హెలికాప్టర్లు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం- ఎలక్ట్రానిక్ సిటీ- హెచ్ఏఎల్ మార్గాల్లో సంచరించనున్నాయి. ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి ఉదయం 9.30 గంటల వరకు, మద్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రెండు హెలికాప్టర్ ట్యాక్సీలు సంచరిస్తాయి.

జీఎస్ టీతో కలిపి టిక్కెట్ ధర
ప్రతి ఒక్క టిక్కెట్ ధర రూ. 4,100 (రూ. 3,500+జీఎస్ టీ) నిర్ణయించారు. ప్రయాణికులతో పాటు 15 కేజీల లగేజీని హెలికాప్టర్ ట్యాక్సీలో అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రం దగ్గరకు లగ్జీరీ ట్యాక్సీ కార్లలో ప్రయాణిస్తే రూ. 2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటడటంతో హెలికాప్టర్ ట్యాక్సీలు గిరాకి ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications