బెంగుళూరులో మరో లైంగిక దాడి: ఇద్దరు బాలికలను బలవంతంగా..
ఇద్దరు బాలికలతో పాటు ఓ మహిళను జనావాసం లేని ప్రదేశానికి తీసుకెళ్లిన ఓ వ్యక్తి వారిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది.
బెంగుళూరు: నగరంలో రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు వారి భద్రతను ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా జరిగిన కీచకపర్వం ఇంకా చర్చల్లో నానుతుండగానే.. వరుసగా మహిళలపై లైంగిక దాడుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
ఇద్దరు బాలికలతో పాటు ఓ మహిళను జనావాసం లేని ప్రదేశానికి తీసుకెళ్లిన ఓ వ్యక్తి వారిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది. వయ్యాలి కావలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మంగళవారం నాడు సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనలో.. వయ్యాలి కావలి పోలీస్ స్టేషన్ కు సమీపం నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను ఓ యువకుడు అడ్డుకున్నాడు. మునీశ్వరబ్లాక్ కు చెందిన ఆ యువకుడు మహిళను అడ్డగించి లైంగిక దాడికి యత్నించాడు.
అదే యువకుడు.. అదే రోజు సాయంత్రం మరో ఇద్దరు బాలికల పట్ల కూడా అలాగే ప్రవర్తించాడు. కావలి 5వ మెయిన్ రోడ్డులో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులను బలవంతం చేశాడు. నిర్మానుష్యంగా ఉన్న ఓ ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.
ఘటనానంతరం బాధిత బాలికల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు స్థానిక భవన నిర్మాణ కార్మికుడని, అతనికి గంజాయి అలవాటు కూడా ఉండవచ్చునని గుర్తించారు.












Click it and Unblock the Notifications