బెంబేలెత్తిపోతున్న బెంగళూరు: ఇళ్ల ముందు చెత్త పడేస్తోన్న మున్సిపల్ సిబ్బంది

బెంగళూరులో ఎక్కడపడితే అక్కడ చెత్త పడేసే వారికి తగిన విధంగా బుద్ధి చెబుతున్నారు గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులు. నగరంలో పరిశుభ్రతను పెంపొందించడానికి, చెత్త సమస్యను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటోన్నారు. బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (BSWML) అక్రమ వ్యర్థాల తొలగింపుపై కొరడా ఝుళిపిస్తోంది. రోడ్ల పక్కన చెత్త వేసిన వారిని గుర్తించి, అదే చెత్తను వారి ఇంటి ముందు పోస్తోంది.. భారీ జరిమానాలను విధిస్తోంది.

ఎక్కడపడితే అక్కడ చెత్తవేయడం బెంగళూరులో నిషేధం. ఇటువంటి చోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు అయ్యాయి. రౌండ్ ద క్లాక్ నిఘా ఉంటోందలాంటి ప్రాంతాల్లో. అర్ధరాత్రి అయినా సరే.. చెత్త వేసే వారిని క్షణాల్లో గుర్తిస్తారు. ఈ క్రమంలో గ్రేటర్ బెంగళూరు నార్త్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు అధికారులు. చాలామంది నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. ఇంటి ముందు చెత్త బండ్లు వస్తోన్నప్పటికీ.. రహదారులు, బహిరంగ ప్రదేశాలలో ఘన వ్యర్థాలను పారవేస్తున్నట్లు తేలింది.

Bengaluru Takes a Stand Trash Dropped at the Doorsteps of Habitual Litterbugs

దీంతో కఠిన చర్యలకు దిగారు. అక్కడ పోగైన చెత్త మొత్తాన్నీ ఎత్తుకుని, వాటిని పారవేసిన వారి ఇళ్ల ముందే డంప్ చేస్తోన్నారు. అక్కడితో ఆగట్లేదు. భారీగా జరిమానా వసూలు చేస్తోన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను BSWML తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. బృహత్ బెంగళూరు మహానగర పాలిక నార్త్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో, రహదారుల పక్కన, ఇతర బహిరంగ ప్రదేశాలలో చెత్త వేసిన వ్యక్తుల ఇళ్లను గుర్తించి, వారి ఇంటి ముందు చెత్తను ఉంచడం ద్వారా జరిమానాలు విధించినట్లు వెల్లడించింది.

నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి కనీస జరిమానాగా 2,000 రూపాయలను వసూలు చేశారు. దీని తీవ్రతను బట్టి జరిమానాలు 10,000 రూపాయల వరకు ఉండొచ్చు. ఇంటి ముందు పారబోసిన చెత్తను మళ్లీ మున్సిపల్ సిబ్బందే తొలగించాల్సి రావడం వల్ల దీనికోసం అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. నగరంలో చెత్త వేయడాన్ని అరికట్టడం, పౌరులలో బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.

తొలి విడతలో నార్త్ బెంగళూరులో 200 నివాసాలను గుర్తించారు. వారి ఇంటి ముందు చెత్త పారవేశారు. రూ. 2,000 నుంచి 10,000 రూపాయల వరకు జరిమానా వసూలు చేసినట్లు బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కరీ గౌడ తెలిపారు. తరచుగా నిబంధనలు ఉల్లంఘించే వారి వీడియోలను మార్షల్స్ రికార్డు చేశారని, ఫోన్ నంబర్ల ఆధారంగా వాళ్ల ఇళ్లను గుర్తించామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+