మరదలిపై మూడు నెలలుగా నీతిమాలి టెక్కీ లైంగిక దాడి
బెంగళూరు: నీతిమాలిన ఓ 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన మరదలు పట్లు మూడు నెలలుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బెంగళూరులోని ఓ ఐటి కంపెనీలో పనిచేస్తున్న అతన్ని పోలీసులు అరెస్టు చేసఆరు. 16 ఏళ్ల అమ్మాయి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైసూరుకు వచ్చిన వెంటనే వెంకటేష్ అనే ఆ టెక్కీని పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడు బెంగళూరులోని చందపురాకలో బోగాడికి చెందినవాడు. ఉదయగిరి పోలీసులు వెంకటేష్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వెంకటేష్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది. మంచి విద్యను అందించడానికంటూ తన మరదలిని కూడా వెంట బెంగళూరు తీసుకుని వచ్చాడు.

తన భార్య లేని సమయం చూసి అతను తన మరదలిపై లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. తన ఆవేదనను ఆ అమ్మాయి తల్లితో చెప్పుకుంది. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాజంలో పరువు పోతుందనే భయంతోనూ, వెంకటేష్ బెదిరింపులతోనూ నెలల తరబడి బాధితురాలు ఆ విషయాన్ని దూస్తూ వచ్చింది.
ఇటీవలి కాలంలో బెంగళూరులో అమ్మాయిలపై లైంగిక దాడులకు సంబంధించిన విషయాలు విరివిగా వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు పాఠశాలల్లో బాలికలపై లైంగిక దాడులు జరగడం కలకలం రేపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications