తల్లిని చంపేసి అండమాన్ లో లవర్ తో ఎంజాయ్ చేసిన లేడీ టెక్కీ, ఉద్యోగం పోయి జైల్లో అదోగతి!
బెంగళూరు: తల్లిని దారుణంగా హత్య చేసి ప్రియుడితో కలిసి పరారైన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు (లేడీ టెక్కీ) అమృతను అండమాన్ నికోబార్ లోని పోర్ట్ బ్లేర్ లో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. లేడీ టెక్కీ అమృతతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం బెంగళూరులోని మారతహళ్ళిలో తల్లి నిర్మలాను దారుణంగా హత్య చేసిన లేడీ టెక్కీ అమృత సాఫీగా అండమాన్ పారిపోయి ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో అమృత ప్రియుడి బైక్ గుర్తించిన పోలీసులు వెంటాడి లేడీ టెక్కీ, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.

నిద్రపోతున్న తల్లి హత్య
కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంటిలో ఈ నెల 2వ తేదీ వేకువ జామున నిద్రపోతున్న తల్లి నిర్మలాను అమృత దారుణంగా హత్య చేసింది. పక్క గదిలో నిద్రపోతున్న సోదరుడు హరీష్ మీద అమృత హత్యాయత్నం చేసింది. అయితే హరీష్ తీవ్రఅస్వస్థతకు గురైనాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన అమృత ప్రియుడు శ్రీధర్ తో కలిసి బైక్ లో అక్కడి నుంచి పరారైయ్యింది.

ప్రియుడితో ఎంజాయ్
తల్లి నిర్మలాను హత్య చేసిన అమృత ప్రియుడు శ్రీధర్ తో కలిసి బైక్ లో నేరుగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు ఎయిర్ పోర్టు) చేరుకుంది. బైక్ పార్కింగ్ స్థలంలో పెట్టిన శ్రీధర్, అమృత విమానంలో అండమాన్ నికోబార్ వెళ్లిపోయారు. అండమాన్ లోని పోర్టు బ్లేర్ లో ప్రియుడు శ్రీధర్ తో కలిసి అమృత ఎంజాయ్ చేసింది.

ప్రియుడితో కలిసి పరార్
నిర్మల హత్యకు గురి కావడం, హరీష్ మీద హత్యాయత్నం జరగడంతో కేఆర్ పురం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో నిర్మల హత్యకు గురైయ్యిందని మొదట పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వీరి ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన కేఆర్ పురం పోలీసులు షాక్ కు గురైనారు. లేడీ టెక్కీ అమృత ఇంటి సమీపంలో ప్రియుడు శ్రీధర్ తో కలిసి బైక్ లో పరారైయ్యిందని పోలీసులు గుర్తించారు.

ధీమాగా వెళ్లిన టెక్కీ
బైక్ లో అమృత ఇంటి దగ్గరకు ఆమె ప్రియుడు శ్రీధర్ వచ్చిన సందర్బంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. తరువాత అమృత ఓ బ్యాగ్ తో పాటు ప్రియుడు శ్రీధర్ బైక్ ఎక్కి అక్కడి నుంచి ధీమాగా వెళ్లిపోయిందని పోలీసులు గుర్తించారు. శ్రీధర్ బైక్ ఎక్కడ ఉందని పోలీసులు ఆరా తీశారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో శ్రీధర్ గుర్తించిన పోలీసులు అతను ప్రియురాలు అమృతతో కలిసి విమానంలో అండమాన్ పారిపోయాడని గుర్తించారు. అండమాన్ చేరుకున్న పోలీసులు అక్కడి పోర్టు బ్లేర్ లో ఎంజాయ్ చేస్తున్న లేడీ టెక్కీ అమృత, ఆమె ప్రియుడు శ్రీధర్ లను అరెస్టు చేశారు.

లవర్ తో పెళ్లికి నో చెప్పినందుకే!
తాను రూ. 15 లక్షలు అప్పు చేశానని, అప్పులు ఇచ్చిన వారు ఇంటి దగ్గరకు వస్తామని చెప్పారని, వారు ఇక్కడికి వస్తే పరువు పోతుందని, తల్లిని హత్య చేస్తే సమస్యలు తీరిపోతాయని అమృత ఆమె సోదరుడు హరీష్ కు చెప్పిందని, తల్లిని హత్య చెయ్యడానికి హరీష్ అంగీకరించలేదని పోలీసులు అన్నారు. అయితే ప్రేమించిన వ్యక్తిని అమృత పెళ్లి చేసుకోవడానికి ఆమె తల్లి నిర్మల అంగీకరించలేదని, అందుకే ఆమెను హత్య చేసిందని పోలీసులు తెలిపారు.

మంచి ఉద్యోగం పోయింది, జైల్లో అదోగతి!
బెంగళూరు నగరంలోని మారతహళ్ళిలోని ఓ ప్రసిద్ది చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో అమృత సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంటిలో టెక్కీ అమృత తల్లి నిర్మల, సోదరుడు హరీష్ తో కలిసి నివాసం ఉంటోంది. తల్లిని హత్య చేసి, సోదరుడి మీద హత్యాయత్నం చేసిన అమృత జైలుపాలైయ్యింది. మంచి ఉద్యోగం పోయి జైలుకు పోవడంతో అమృత ఇప్పుడు ఏం సాధించింది ? అంటున్నారు ఆమె నివాసం ఉంటున్న చుట్టుపక్కల వారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications