"నా పేరు భరత్ అని చెప్పగానే భార్య, బిడ్డ ముందే కాల్చి చంపారు"
Pahalgam Terror Attack: జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనిపై భారత్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇదో పిరికిపంద చర్యగా, హేయమైన చర్యగా అభివర్ణించాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే పాకిస్థాన్ కు చెక్ పెట్టేందుకు 5 సంచలన నిర్ణయాలు తీసుకుని పాకిస్థాన్ కు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది.
అయితే పహల్గాం ఉగ్రదాడి సమయంలో టెర్రరిస్టులు ఏరికోరి మారణహోమం జరిపారు. కేవలం పురుషులనే హతమార్చారు. అది కూడా హిందువా లేదా అడిగి.. అనుమానం వచ్చినవారి దుస్తులు విప్పి మరీ చంపేశారు. ఉగ్రవాదులు మతం అడిగినప్పుడు ముస్లిం అని చెబితే కల్మా చదవమన్నట్లు సమాచారం. కల్మా చదవకపోతే అక్కడికక్కడే బుల్లెట్ల వర్షం కురిపించి చంపేశారు.
కశ్మీర్‌లోని పహల్గాం పర్యటనకు వెళ్లిన బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల టెక్కీ భరత్ భూషణ్‌ను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. అతని మతం తెలియజేయగానే కుటుంబ సభ్యుల ముందే అతన్ని కాల్చి చంపారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. "నా పేరు భరత్" అనే అతని చివరి మాటలు పూర్తి కాకముందే టెర్రరిస్టులు అతి దగ్గర నుంచి తలపై కాల్చి చంపారు. అతని భార్య, బిడ్డ ముందే అతడ్ని హతమార్చడం ఆ కుటంబం జీర్ణించుకోలేక పోతోంది.

భరత్ భూషణ్ బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అతని భార్య డాక్టర్. వారికి 3 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఆ కుటుంబానికి ఉగ్రదాడి రూపంలో కుటుంబ పెద్దను కోల్పోయి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఉగ్రవాదులు తన కుమారుడి దగ్గరకు వచ్చి.. పేరు, మతం అడిగారు. తన పేరు భరత్ భూషణ్ అని, హిందువునని చెప్పగానే పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారని భరత్ భూషణ్ తండ్రి చెన్నవీరప్ప వివరించారు.
సమ్మర్ ట్రిప్ కోసం కాశ్మీర్ వెళ్లిన భరత్ ఫ్యామిలీ.. అక్కడ ఆహ్లాదకరంగా గడిపింది. చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఇంటికి వీడియో కాల్ చేశాడు భరత్. మంచుతో కప్పి ఉన్న ఆ ప్రాంత అందాలను చూపించాడని భరత్ తండ్రి చెన్న వీరప్ప కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ దారుణానికి పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించాలని కేంద్రాన్ని కోరారు.












Click it and Unblock the Notifications