కర్ణాటక రిజల్ట్స్: సెలవుల్లో టెక్కీలు, ఎందుకంటే?
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై టెక్కీలు ఆసక్తిని చూపుతున్నారు. మంగళవారం నాడు ఉదయం నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఈ ఫలితాలపై టెక్కీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ ఫలితాలను తెలుసుకొనేందుకు వీలుగా టెక్కీలు తమ కార్యాలయాలకు సెలవు పెట్టారు.
కర్నాటక ఎన్నికల ఫలితాలు: ఎప్పటికప్పుడు... మరిన్ని వివరాల ఇక్కడ చూడండి
సాధారణంగా వారాంతపు సెలవుల్లో టెక్కీలు సంతోషంగా గడిపేందుకు ఇష్టపడతారు. క్రికెట్, పుట్‌మ్యాచ్ లు తాము పనిచేసే నగరాల్లో ఉన్న సమయంలో కూడ ఆ మ్యాచ్‌లు తిలకించేందుకు ప్రాధాన్యతను ఇస్తారు.

అయితే కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడ టెక్కీలు కొంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎక్కువ మంది టెక్కీలు కార్యాలయాలకు సెలవులు పెట్టి కర్ణాటక ఎన్నికల ఫలితాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ హంగ్ వస్తాయని తేల్చి చెప్పాయి. కానీ, ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా కన్పిస్తున్నాయి. ఈ తరుణంలో ఐటీ ప్రోఫెషనల్స్ తమ సహోద్యోగులతో కలిసి ఎన్నికల ట్రెండ్స్‌ను అంచనావేసేందుకు సెలవులు తీసుకొన్నారు.
బెంగుళూరులో పనిచేసే చంద్రశేఖరన్ అనే ఐటీ ఉద్యోగి తన స్నేహితులతో కలిసి సెలవు పెట్టాడు. ఈ ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెబుతున్నారు. ఈ ఫలితాలను టీవీల్లో ప్రత్యక్షంగా చూసేందుకుగాను కొందరు టెక్కీలు సిక్ లీవ్స్ కోసం ధరఖాస్తు చేసుకొన్నారు.
టక రాష్ట్రంలో మే 12వ తేదిన జరిగిన పోలింగ్ లో 72.13 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే బెంగుళూరు లో మాత్రం కేవలం 51 శాతం మాత్రమే ఓట్లు నమోదయ్యాయి.బెంగుళూరు సిటీలో ఎక్కువగా టెక్కీలు ఉంటారు. ఓటింగ్ లో పాల్గొన్నటెక్కీల శాతం తక్కువగా ఉంటుందని అంచనా.












Click it and Unblock the Notifications