ట్రాఫిక్ అస్తవ్యస్తం- అదనపు డీజీపీపై వేటు: 3 నెలల్లోనే ట్రాన్స్‌ఫర్
బెంగళూరు: మొన్నటికి మొన్న సిలికాన్ సిటీ బెంగళూరు (Bengaluru) ఒక్కసారిగా స్తంభించిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడంది. వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సాయంత్రం అనగా తమ కార్యాలయాల నుంచి బయటపడ్డ ఉద్యోగులు అర్ధరాత్రయినా తమ ఇళ్లకు చేరుకోలేనంత భయానకంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఓ మోస్తరు నుంచి భారీ వర్షం (Heavy rains) కురవడం వాహనాల రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడం వల్ల కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. మరి కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిపోవడం వంటి కారణాలు వాహనాల రాకపోకలను ప్రభావితం చేశాయి.

ఔటర్ రింగ్ రోడ్, మార్తహళ్లి, సర్జాపురా, బెల్లందూరు, కృష్ణరాజపుర, వైట్ ఫీల్డ్, మహదేవపుర, రామ్మూర్తి నగర్, సిల్క్ బోర్డ్, ఎలక్ట్రానిక్ సిటీ, చందాపురా, అత్తిబెలె, సూర్యనగర్, హెబ్బగోడి, కోరమంగళ, ఇందిరా నగర్, మైసూరు రోడ్.. ఇలా బెంగళూరులోని అనేక ప్రాంతాల్లో వాహనాలు స్తంభించాయి.
కొన్ని మార్గాల్లో మెట్రో కారిడార్ (Metro corridor) నిర్మాణం ఉండటం, అలాంటి చోట రోడ్లపై గుంతలు ఏర్పడటం.. వంటివీ వాహనాల రాకపోకలు నెమ్మదించడానికి కారణం అయ్యాయి. మెట్రో నిర్మాణం ఉన్నందున సగం రోడ్డు నిర్మాణ సామాగ్రితో నిండిపోయాయి. అలాంటి చోట్ల రోడ్లు డ్యామెజ్ అయ్యాయి.
ఈ పరిణామాలు- బెంగళూరు ట్రాఫిక్ (Bengaluru traffic) విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ అలోక్ కుమార్ (ADGP Alok Kumar)పై వేటు పడటానికి కారణం అయ్యాయి. ఆయనను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండర్ సెక్రెటరీ నాగప్ప ఎస్ పరీత్ ఉత్తర్వులు జారీ చేశారు.
1994 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ బదిలీ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆయనను పోలీస్ ట్రైనింగ్ విభాగం అదనపు డీజీపీగా పోస్టింగ్ ఇచ్చింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ అదే హోదాలో కొనసాగాల్సి ఉంటుంది. ట్రైనింగ్ విభాగం అదనపు డీజీపీ డాక్టర్ పీ రవీంద్రనాథ్ పదవీ విరమణ చేయనుండటం వల్ల ఏర్పడనున్న ఖాళీని అలోక్ కుమార్‌తో భర్తీ చేసినట్టయింది.
మూడు నెలల వ్యవధిలోనే అలోక్ కుమార్ బదిలీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జూన్ 8వ తేదీన ఆయనను బెంగళూరు ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ అదనపు డీజీపీగా పోస్టింగ్ ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరు ట్రాఫిక్ అస్తవ్యస్థం కావడం ఆయనను మూడు నెలల్లోపే బదిలీ అయ్యేలా చేసిందని చెబుతున్నారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications