భార్య ఫ్రెండ్ మీద కన్ను, అర్దరాత్రి ఇంట్లో ఆమెను ఏం చేశాడంటే, షాక్ !

బెంగళూరు: రాత్రి హఠాత్తుగా అదృశ్యమైన యువతి తెల్లవారుజామున ఆమె నివాసం ఉంటున్న ఇంటి సమీపంలోనే శవమై కనిపించింది. బెంగళూరు పోలీసులు యువతి హత్య కేసును ఛేదించారు. బెంగళూరు నగరంలోని మహదేవపురలోని మహేశ్వరినగర్ లో నివాసం ఉంటున్న కృష్ణ చంద్ర సేథి(28)ని అరెస్టు చేశారు. భార్య స్నేహితురాలిని ఎందుకు హత్య చేశాను అని నిందితుడు పోలీసులకు మ్యాటర్ చెప్పాడు.

కర్ణాటకలోని కలబురగికి చెందిన మహానంద అలియాస్ మహాలక్ష్మి, ఆమె అక్క సరోజ బెంగళూరు చేరుకుని మహదేవపురలోని మహేశ్వరి నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నారు. అక్కాచెల్లెళ్లు మహదేవపురలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నారు. రాత్రి మహానంద, ఆమె అక్క సరోజ ఇంటిలోనే ఉన్నారు. తాను బయకు వెళ్లి వస్తానని అక్క సరోజకు చెప్పిన మహానంద తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

 Bengaluru:

తరువాత మహానంద ఆకస్మికంగా కనిపించకుండా పోయింది. అన్ని చోట్లా వెతికిన అక్క సరోజ అదే రోజు రాత్రి 12 గంటలకు మహదేవపుర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన చెల్లెలు మహానంద కనిపించకపోయిందని ఫిర్యాదు చేసింది. తెల్లవారుజామున 5 గంటలకు సరోజ ఇంటి నుంచి బయటకు రాగా ఆమె నివాసం ఉంటున్న భవనం ఆవరణంలో సోదరి మహానంద మృతదేహం చూసి గట్టిగా కేకలు వేసింది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మహానందను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని క్షుణ్ణంగా విచారించగా ఇంటి సమీపంలో మహానంద చెప్పులు కనిపించాయి. మృతదేహం పాదాలపై ఏమాత్రం దుమ్ము లేదని పోలీసుల విచాణలో తేలింది.

 Bengaluru:

మహానందను ఆమె నివాసం ఉంటున్న ఇంటి చుట్టుపక్కల వాళ్లే హత్య చేసి ఉంటారని, హంతకులు సమీపంలోనే ఉండవచ్చని పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు ఈ కోణంలో విచారణ కొనసాగించగా, ఇరుగుపొరుగు వారిని విచారించారు. మహానంద నివాసం ఉంటున్న పక్క ఇంటిలో నివాసం ఉండే కృష్ణ చంద్ర సేథి తీరుపై అనుమానం రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.

ఒడిశాకు చెందిన నిందితుడు కృష్ణ చంద్ర సేథి నగరంలోని ఓ టెక్ పార్క్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్య భాగ్యశ్రీ మహానంద, ఆమె అక్క సరజో పని చేసే పెట్రోల్‌ బంకులో పనిచేస్తోంది. చంద్ర భార్య భాగ్యశ్రీ, సరోజ, మహానంద స్నేహితులు అని పోలీసులు విచారణలో వెలుగు చూసింది. రాత్రి 12 గంటల వరకు పెట్రోల్ బంకులో భాగ్యశ్రీ పని చెయ్యాల్సి ఉంది.

భార్య భాగ్యశ్రీ పెట్రోల్ బంకులో ఉండటంతో ఇంట్లో కృష్ణ చంద్ర ఒక్కడే ఉన్నాడు. రాత్రి 8 గంటల సమయంలో మహానంద ఇంటి నుంచి బయటకు రాగా నిందితుడు చంద్రా ఆమెను ఒక్కసారిగా అతని ఇంటిలోకి ఈడ్చుకెళ్లి తలుపులు వేసి ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో మహానంద కేకలు వేయడంతో భయపడిన నిందితుడు చంద్ర ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.

అనంతరం మహానంద మృతదేహాన్ని ఇంట్లోని డ్రమ్ములో దాచిపెట్టాడు. అర్దరాత్రి ఇంటికి వెళ్లిన భాగ్యశ్రీ నిద్రపోయింది. నిందితుడు కృష్ణ చంద్ర శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో డ్రమ్ములోంచి మహానంద మృతదేహాన్ని బయటకు తీసి ఆమె ఇంటి ముందు శవం పడేసి ఇంటికి వెళ్లి లోపల లాక్ చేసుకున్నాడు.

ఉదయం మహానంద మృతదేహం లభించిన తరువాత స్థానిక ప్రజలు గుమిగూడారు, కాని నిందితుడు చంద్ర మాత్రం అతని ఇంటి నుండి బయటకు రాలేదు. పోలీసులు అపార్ట్‌మెంట్‌లోని అందరినీ విచారిస్తున్నప్పుడు, కృష్ణ చంద్రను కూడా బయటకు పిలిచి ప్రశ్నించారు. ఆ సమయంలో చంద్ర అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా మహానంద ను తానే హత్య చేశానని నిందుతు నిజం ఒప్పుకున్నాడని మహదేవపుర పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+