బెడ్ రూంలో నగ్నంగా దంపతులు, వీడియోలు తీసి పొర్న్ సైట్ లో పెట్టిన ఇంటి యజమాని !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: దంపతులు బెడ్ రూంలో ఏకాంతంగా నగ్నంగా ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు చిత్రీకరించిన ఇంటి యజమాని కొడుకు ఆ క్లిప్పింగ్స్ పొర్న్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. వికృతచేష్టలు చేసిన కామాంధుడి కోసం బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు.

  శృంగారం తర్వాత అసలు మైనర్ ని భార్య గా చేసుకోవడం ఏంటి ? | Oneindia Telugu

  కోరమంగలలో నివాసం ఉంటున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు అంజన్ కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నామని బెంగళూరు సైబర్ క్రైం పోలీసు అధికారులు తెలిపారు. తన భర్తతో ఏకాంతంగా ఉన్న నగ్న చిత్రాలు ఇంటర్నెట్ లో ప్రత్యేక్షం కావడంతో షాక్ కు గురైన మహిళ మానసికంగా కుంగిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.

  అసిస్టెంట్ ప్రొఫసర్

  అసిస్టెంట్ ప్రొఫసర్

  బెంగళూరులోని ప్రముఖ ప్రైవేట్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫసర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆయన భార్య (30)తో కలిసి కోరమంగలలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటిలో అద్దెకు నివాసం ఉంటున్నారు. వారి ఇంటి యజమాని కొడుకు వికృత కామాంధుడు అంజన్.

  నకిలి తాళంతో బెడ్ రూంలో కెమెరా

  నకిలి తాళంతో బెడ్ రూంలో కెమెరా

  అసిస్టెంట్ ప్రోఫసర్ ఇంటి తాళం (డూప్లికేట్) ఒకటి అంజన్ దగ్గర ఉంది. గత నెల చివరి వారంలో దంపతులు ఇద్దరూ వారి ఉద్యోగాలకు వెళ్లారు. ఆ సందర్బంలో అంజన్ ఇంటి తాళం తీసి వారి బెడ్ రూంలో రహస్యంగా సీసీకెమెరా బిగించాడు. ప్రతి రోజూ సాయంత్రం దంపతులు ఇద్దరూ ఇంటికి వస్తారు.

  రాత్రి బెడ్ రూంలో దంపతులు !

  రాత్రి బెడ్ రూంలో దంపతులు !

  ప్రతి రోజూ రాత్రి దంపతులు ఇద్దరూ ఏకాంతంగా నగ్నంగా బెడ్ రూంలో గడిపేవారు. ఆ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఒక రోజు ఎప్పటిలాగే దంపతులు ఇద్దరూ వారి ఉద్యోగాలకు వెళ్లారు. తరువాత అంజన్ వారి ఇంటి తాళం తీసి సీసీకెమెరాను బయటకు తీసుకువచ్చాడు.

  పొర్న్ సైట్ లో ఫ్రెండ్ చూశాడు

  పొర్న్ సైట్ లో ఫ్రెండ్ చూశాడు

  సెప్టెంబర్ 29వ తేదీన దంపతులు ఏకాంతంగా నగ్నంగా ఉన్న దృశ్యాలను అంజన్ పొర్న్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. ఇటీవల అసిస్టెంట్ ప్రొఫసర్ స్నేహితుడు పొర్న్ వెబ్ సైట్ లో దంపతుల నగ్న చిత్రాలు చూసి షాక్ కు గురై వెంటనే స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు.

  ఇల్లు ఖాళీ చేసిన దంపతులు

  ఇల్లు ఖాళీ చేసిన దంపతులు

  పొర్న్ వెబ్ సైట్ లింక్ ను అసిస్టెంట్ ప్రొఫసర్ మొబైల్ కు పంపించాడు. అసిస్టెంట్ ప్రొఫసర్ తన భార్యతో నగ్నంగా ఉన్న దృశ్యాలు చూసి కుమిలిపోయాడు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అసిస్టెంట్ ప్రొఫసర్ భార్య (30) ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

  ఇంటి యజమాని కొడుకు పనే !

  ఇంటి యజమాని కొడుకు పనే !

  బెంగళూరు సైబర్ క్రైం పోలీసుల ప్రాథమిక విచారణలో ఇంటి యజమాని కుమారుడు అంజన్ వారి బెడ్ రూంలో సీసీకెమెరా పెట్టి నగ్న చిత్రాలు రికార్డు చేసి పొర్న్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడని వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న అంజన్ అదృశ్యం అయ్యాడు.

  పొర్న్ వెబ్ సైట్ లో లింక్ !

  పొర్న్ వెబ్ సైట్ లో లింక్ !

  అంజన్ కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నామని సైబర్ క్రైం పోలీసు అధికారులు తెలిపారు. దంపతుల నగ్న చిత్రాలను పొర్న్ వెబ్ సైట్ నుంచి తొలగించామని పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరంలో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరిగినా కొందరు పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చెయ్యడం లేదని సమాచారం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The cyber crime cell of the Bengaluru Police has begun a hunt for a man who allegedly installed a camera in his tenant's bedroom and uploaded videos on porn websites.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి