రాహుల్..బెస్ట్ బ్రదర్ ఇన్ ద వరల్డ్! కితాబిచ్చింది ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: శ్రావణ పౌర్ణమి నాడు రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పార్టీ మాజీ అధ్యక్షుడుచ తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి దిగిన రెండు క్యూట్ పిక్స్ లను ఆమె తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ ఫొటోలు తీసే సమయానికి తమ ఇద్దరి వయస్సు పదేళ్లలోపే ఉంటుందని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.
ఇందులో- ఓ ఫొటోలో రాహుల్.. ప్రియాంకా గాంధీ చెంపపై కొడుతున్నది. ఆమె చెంపలను పట్టుకుని ఉన్న సముదాయిస్తున్న పిక్ మరొకటి. ఈ రెండు ఫొటోల్లో కూడా ప్రియాంకా గాంధీ ముఖం అస్పష్టంగా కనిపించింది. ఈ రెండు ఫొటోలను ఒకదానికొకటి జత చేసి, తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారామె. చిన్నప్పుడు రాహుల్ గాంధీ ఎలా ఉండేవారో.. ఇప్పుడూ అలాగే ఉన్నారనే అర్థం వచ్చేలా కామెంట్లు జత చేశారు. రాహుల్ గాంధీలో ఎలాంటి మార్పులు రాలేదని చెప్పారు. తన సోదరుడి వ్యక్తిత్వం, ప్రవర్తన ఎప్పుడూ హుందాగా ఉంటాయని చెప్పుకొచ్చారు. మై బ్రదర్.. బెస్ట్ బ్రదర్ ఇన్ ద వరల్డ్.. అని కితాబిచ్చారు.

ఈ ఏడాది ఏప్రిల్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ హెలిప్యాడ్ లో ఒకరి భుజంపై ఒకరు చెయ్యి వేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన చెల్లి కోసం తాను ఏదైనా త్యాగం చేస్తానని రాహుల్ గాంధీ చెప్పడం కనిపించిందా వీడియోలో. దేశం అంతా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తోన్న తాను చిన్న హెలికాప్టర్ లో ప్రయాణం సాగిస్తోంటే.. ఉత్తర్ ప్రదేశ్ కే పరిమితమైన ప్రియాంకా పెద్ద హెలికాప్టర్ లో తిరుగుతున్నారని అంటూ కంప్లైట్ చేశారు. ఈ వీడియో- నెటిజన్లను కట్టి పడేసింది. వారిద్దరి మధ్య ఉన్న ఆప్యాయతకు నిదర్శనంగా నిలిచింది.
@RahulGandhi I guess things haven’t changed that much, haan?! 😘..best brother in the world! pic.twitter.com/rD3CrvHY8v
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 15, 2019












Click it and Unblock the Notifications