కేజ్రీకి హజారే అభినందనలు, బీజేపీ ఓటమి దురదృష్టకరం: కిరణ్ బేడీ భర్త
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
ఆయన స్వస్ధలం రాలేగావ్ సిద్ధి (మహారాష్ట్ర)లో మీడియాతో మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ తన ఆయుధమైన అందోళన (పోరాటం)ను అపరాదని సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంతో ప్రజాభిమాన్ని అరవింద్ కేజ్రీవాల్ సంపాదించుకున్నారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.

గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేయరాదని కూడా అరవింద్ కేజ్రీవాల్‌కు సూచించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ తీరుపై కూడా ఆయన మండిపడ్డారు. రైతుల భూములను అధికారులు లాగేసుకునే అధికారాన్ని సరళీకృతం చేశారని ఆరోపించారు.
బీజేపీ ఓటమి పాలవ్వడం దురదృష్టకరం: కిరణ్ బేడీ భర్త
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం దురదృష్టకరమని కిరణ్ బేడీ భర్త బ్రిజ్ బేడీ వ్యాఖ్యానించారు. ఆమెకు అధికారం ఇచ్చి ఉంటే సరికొత్త పాలనను ప్రజలకు అందించిఉండేవారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications