ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా ప్రదానోత్సవం జరిగింది. మార్చి 21న తొలి విడత కొందరికి పద్మ అవార్డులు అందజేశారు. మిగతా వారికి సోమవారం అందించారు. మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును ఆయన కుమారుడు రాజ్‌వీర్ సింగ్ అందుకున్నారు. కల్యాణ్ సింగ్ మరణానంతరం ప్రకటించిన ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా స్వీకరించారు. ఈ పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్రలకు పద్మభూషణ్
అటు హిందూస్థానీ సంగీతంలో ప్రముఖ గాయని ప్రభ ఆత్రే పద్మవిభూషన్ స్వీకరించారు. భారత్ బయోటెక్ ఎండీ, డాక్టర్ కృష్ణ ఎల్ల, ఆయన సతీమణి, సీఎండీ సుచిత్ర సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారాన్నిరాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. నటుడు విక్టర్ బెనర్జీ పద్వభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా, టోక్యో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత షట్లర్ ప్రమోద్ భగత్, ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు.
ఐరిష్ ప్రొఫెసర్ రట్టర్ కోర్టెన్ హోస్ట్ కు పద్మశ్రీ..
ఐర్లాండ్‌కు చెందిన ప్రొఫెసర్ రట్టర్ కోర్టెన్ హోస్ట్‌కు ఐరిష్ పాఠశాలల్లో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు గాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మశ్రీ అవార్డు ప్రదానం చేశారు. తానుసంస్కృతాన్ని ప్రేమిస్తున్నాను.. కాబట్టి తాను ఈ భాషను ప్రోత్సహించడానికి పని చేస్తున్నానని రట్టర్ కోర్టెన్ హోస్ట్ తెలిపారు . ఐరిష్‌లో తమ విద్యార్థులకు సంస్కృత భాష నేర్పుతున్నామని చెప్పారు. పద్మశ్రీ అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతి ఏటా పద్మఅవార్డుల పండుగ
ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ ఏడాదికి గాను మొత్తం 128 పద్మ పురస్కారాల్లో నలుగురికి పద్మవిభూషణ్ ప్రకటించింది . 17 మందిని పద్మభూషణ్, 107 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను మార్చి 21న మొదటి విడత కొందరికి అందజేయగా.. ఈరోజు మిగతావారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా స్వీకరించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications