అవును, నిజం!: డెల్టా వేరియంట్‌ను చంపేసిన కోవాగ్జిన్ -భారత్ బయోటెక్ టీకాకు అమెరికా దిగ్గజ సంస్థ వత్తాసు

క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు వెల్లడికాకముందే అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిననాటి నుంచే భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకా చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించకపోవడం, అమెరికా, యూరప్ దేశాలు సైతం కొవాగ్జిన్ వాడకానికి దూరంగా ఉండటంతో దాని సమర్థతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అదీగాక, కొత్తగా పుట్టుకొచ్చిన వేరియంట్లపై భారత్ లో తయారైన టీకాలు పెద్దగా ప్రభావం చూపడంలేదన్న ప్రచారమూ ఊపందుకుంది. సరిగ్గా ఈ దశలోనే కొవాగ్జిన్ సమర్థతపై అత్యున్నత స్థాయి సంస్థ ఒకటి అనూహ్య ప్రకటన చేసింది..

ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై..

ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై..

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ సంస్థ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్' టీకా సమర్థతపై అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ఐహెచ్) కీలక ప్రకటన చేసింది. కొత్తగా పుట్టుకొచ్చిన ఆల్ఫా, డెల్టా వేరియంట్లను సైతం కోవాక్సిన్ టీకా సమర్థవంతంగా నిలువరించగలిగిందని ఎన్ఐహెచ్ వెల్లడించింది.

కొవాగ్జిన్‌పై అధ్యయనం

కొవాగ్జిన్‌పై అధ్యయనం

కరోనా కొత్త వేరియంట్లపై భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకా పనితీరుపై ఎన్ఐహెచ్ చేసిన అధ్యయనంలో ఈ విషయం నిర్ధారణ అయింది. ఆల్ఫా, డెల్టా వేరియంట్లను సమర్థవంతంగా తటస్థం చేసే ప్రతిరోధకాలను కోవాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నట్లు స్టడీలో గుర్తించారు. ఈ మేరకు అధ్యయనానికి సంబంధించిన డేటాను సైతం ఎన్ఐహెచ్ విడుదల చేసింది..

ఫౌచీ ఏమన్నారంటే..

ఫౌచీ ఏమన్నారంటే..


కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న వ్యక్తుల నుంచి సేకరించిన రక్త నమూనాలపై SARS-CoV-2 ఆల్ఫా (B.1.1.7) డెల్టా (B.1.617) వేరియంట్లను సమర్థవంతంగా తటస్థం చేసే ప్రతి రోధకాలను ఉత్పత్తి చేసిందని ఎన్‌ఐహెచ్‌ వెల్లడించింది. కోవ్యాక్సిన్ టీకా కరోనాపై వంద శాతం పని చేస్తోందని ఎన్ఐహెచ్ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలున్న వారిపై 78శాతం, కరోనాతో పాటు ఇతర వ్యాధులు ఉన్నవారిపై 70 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని తమ పరిశోధనలో తేలిందని ఫౌచీ వివరించారు.

 కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు..

కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు..

ఎన్‌ఐఏఐడీ మద్దతుతో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ భారత్‌లో ప్రజలకు అందుబాటులో ఉన్న సమర్థవంతమైన వ్యాక్సిన్లలో ఒకటిగా భాగమైనందుకు ఆనందంగా ఉందని, దీనిపై మరికొన్ని పరిశోధనలు చేయనున్నట్లు ఎన్ఐహెచ్ వెల్లడించింది. కాగా, కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు జూన్ చివరిలోగా విడుదలవుతాయని కేంద్రం ప్రకటించినప్పటికీ, జులై చివరి వారంలోగా డేటా బహిర్గతం చేస్తామని భారత్ బయోటెక్ తెలిపింది. సదరు డేటాను పరిశీలించిన అనంతరం కొవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+