వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పాయి, మదన్‌మోహన్ మాలవ్యలకు భారతరత్న

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పాయికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వాజ్‌పాయి తోపాటు స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త పండిట్ మదన్‌మోహన్ మాలవ్యకు కూడా భారతరత్నను ప్రకటించింది.

డిసెంబర్ 25న వాజ్‌పాయి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు కేంద్రం ఈ అత్యున్నత పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. డిసెంబర్ 25ను సుపరిపాలన దినోత్సవంగా జరుపనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Bharat Ratna for Atal Bihari Vajpayee, Freedom Fighter Madan Mohan Malaviya

భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి అటల్ బీహారీ వాజ్‌పాయి. వివాద రహితుడిగా, మృధుస్వభావి అయిన ఆయన బిజెపితోపాటు ఇతర పార్టీల నాయకులకు ఆదర్శంగా నిలిచారు. డిసెంబర్ 25నే పండిట్ మాలవ్య జన్మదినం కూడా కావడం గమనార్హం. మాలవ్య స్వాతంత్ర్య సమరయోధుడే కాక, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.

కాగా, వాజ్‌పాయి, మాలవీయలను భారతరత్నతో సత్కరిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్ ఖాతాలో బుధవారం ఉదయం పేర్కొన్నారు. వాజ్‌పాయి, మాలవ్యలకు భారతరత్న ప్రకటించడంపై బిజెపి జాతీయ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు పలువురు నాయకులు వాజ్‌పాయికి భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Former Prime Minister Atal Bihari Vajpayee and freedom fighter Madan Mohan Malaviya will be honoured with the Bharat Ratna, India's highest civilian award, the government announced today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X