దూసుకుపోతున్న ‘భీమ్’యాప్: ప్లేస్టోర్‌లో టాప్, త్వరలో ఐఓఎస్‌కూ

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల విడుదల చేసిన భీమ్‌ ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల విడుదల చేసిన భీమ్‌ ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నాలుగు రోజుల కిందట విడుదల చేసిన ఈ అప్లికేషన్‌ 4.1 రేటింగ్‌తో గూగుల్‌ ప్లేస్టోర్‌లో అగ్రభాగాన నిలవడం గమనార్హం.

ఇప్పటికే 3మిలియన్లకు పైగా మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం.
డిసెంబర్‌ 30న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ అప్లికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోడం ద్వారా ఎవరైనా నగదు రహిత లావాదేవీలు జరుపుకొనే వీలుంది.

BHIM app crosses 3 mn downloads, coming to iOS in ten days: NITI Aayog CEO

డౌన్‌లోడ్‌ చేసుకున్న భీమ్‌ అప్లికేషన్‌లో బ్యాంకు ఖాతా నెంబరు, శాఖల వివరాలు నమోదు చేసుకోడంతో ఏకీకృత లావాదేవీలు చేసుకునేందుకు వీలుంది. సామాన్యులు సైతం తేలికగా ఉపయోగించడం కోసం స్మార్ట్‌ఫోన్లకే పరిమితం కాకుండా అప్‌డేటెడ్‌ ఫీచర్‌ ఫోన్లలోనూ ఈ అప్లికేషన్‌ పనిచేసే విధంగా రూపొందించారు.

ఏకీకృత చెల్లింపులు లేని వారికి కూడా ఆయా బ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఎంఐడీ కోడ్ల ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపులు జరుపుకోవచ్చు. అయితే, ఈ యాప్ ప్రస్తుతం ఆపిల్‌ ఫోన్లు, ఐవోఎస్‌ ఫోన్లలో ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలో వీటిల్లో కూడా భీమ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+