వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలో చేరిన ‘రేసు గుర్రం’ విలన్

ప్రముఖ భోజ్‌పురి నటుడు రవి కిషన్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ.

|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ: ప్రముఖ భోజ్‌పురి నటుడు రవి కిషన్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

Bhojpuri Actor Ravi Kishan, Congress Candidate In 2014, Formally Joins BJP

కాగా, రవికిషన్‌ రాజకీయ పార్టీలో చేరడం ఇదే తొలిసారి కాదు. 2014లో ఆయన కాంగ్రెస్‌ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. రవికిషన్‌ పలు హిందీ, తెలుగు చిత్రాల్లోనూ నటించారు. తెలుగులో 'రేసు గుర్రం', 'కిక్‌ 2', 'సుప్రీమ్‌' తదితర తెలుగు చిత్రాల్లో ఆయన ముఖ్యపాత్రలు పోషించారు.

మాయావతిపై మోడీ విసుర్లు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోప్రధాని నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ఒరైలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.

'నోట్లరద్దుతో చాలా ఇబ్బందులు పడ్డామని సోదరి(మాయావతి) అంటున్నారు.. ఆమెకు సరిపడా సమయం రాలేదని బాధపడుతన్నట్లు ఉన్నారు.. ఇప్పుడు బీఎస్‌పీ బహుజన్‌ సమాజ్‌ పార్టీకాదు.. బెహన్‌జీ కా సంపత్తి పార్టీగా మారిపోయింది' అని ఎద్దేవా చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో అత్యంత అద్వానంగా ఉన్న ప్రాంతం ఏదైనా అయితే బుందేల్‌ఖండే అని అయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే బుందేల్‌ఖండ్‌ సమస్యలను పట్టించుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

English summary
Bhojpuri actor Ravi Kishan was formally inducted into the BJP on Sunday around 10 am by party president Amit Shah in the presence of fellow actor and MP Manoj Tiwari in New Delhi. Mr Tiwari, who is also the chief of the BJP's Delhi unit had broken the news of Mr Kishan's decision to join the party on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X