అఖిలేశ్‌పై భోజ్‌పురి స్టార్ పోటీ : మోదీని మరోసారి పీఎం చేస్తానన్న అఖిలేశ్ ప్రత్యర్థి
లక్నో : లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి అధికారం చేపట్టాలని భావిస్తోన్న బీజేపీ .. తమ ప్రత్యర్థులను సైతం వదలడం లేదు. ప్రత్యర్థి పార్టీ నేతలపై కూడా బలమైన అభ్యర్థులను నిలబెట్టి .. ఈ ఎన్నికలు తమకు ఎంత ప్రతిష్టాత్మకమో తెలియజేస్తున్నాయి. ఇప్పటికే సినీతారలకు కూడా టికెట్ ఇవ్వగా .. తాజాగా ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పై బోజ్‌పురి నేపథ్యగాయకుడు, నటుడు దినేశ్ లాల్ యాదవ్‌ను బరిలోకి దింపింది.

అఖిలేశ్ వర్సెస్ నిరహౌ
ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అజాంఘర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీచేస్తున్నందన .. ఏనుగు గుర్తు అభ్యర్థి ఉండరు. ఇక అంతర్గత ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను నిలబెట్టదు. ఈ క్రమంలో అజాంఘర్ కోటపై కమల జెండా ఎగరేయాలని భావించిన బీజేపీ .. భోజ్‌పురి నలుడు దినేశ్ లాల్ యాదవ్ పేరును ఖరారు చేసింది. దినేశ్ నిరహౌగా సుపరిచితులు. గతనెలలో బీజేపీలో చేరిన దినేశ్ యాదవ్ పశ్చిమ యూపీ, బీహార్‌లో మంచి పేరున్నది.

భోజ్‌పురి రారాజు
దినేశ్ యాదవ్ భోజ్‌పురి సినిమా ఇండస్ట్రీలో స్టార్. పాట్నా సే పాకిస్థాన్, నిరహౌ చాహల్లండన్, నిరహౌ రిక్షా వాలా, నిరహౌ హిందుస్థాన్ అనే బ్లాక్ బ్లస్టర్ సినిమాల్లో నటించార దినేశ్. అంతేకాదు 2012లో బిగ్ బాస్ 6వ సీజన్‌లో నటించారు. వాస్తవానికి దినేశ్ సమాజ్ వాదీ పార్టీలో చేరాల్సి ఉంది. కానీ ఎస్పీ, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

మరోసారి నమో నమ:
దేశానికి మోదీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు దినేశ్. ఇది నా ఆత్మ నుంచి వస్తున్న పిలుపు అని పేర్కొన్నారాయన. రాజకీయాల్లో చేరాలని అనుకోలేదు కానీ .. మోదీని మరోసారి పీఎం చేసేందుకు బీజేపీలో చేరానని స్పష్టంచేశారు. 2016లో దినేశ్‌కు అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాష్ అవార్డును ప్రదానం చేసింది. ఇప్పుడు అఖిలేశ్‌తో దినేశ్ ఢీకొట్టబోతున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications