విషాదం: కారులో ఇరుక్కుని ఊపిరాడక బాలుడి మృతి

కారు అద్దాలు పూర్తిగా మూసి ఉండటంతోనే లోపల గాలి ఆడక.. అతిశయ్ మరణించినట్లు అతడి తాత కమల్ జైన్ మీడియాకు తెలిపారు. దాదాపు రెండున్నర గంటల తర్వాత తన కుమారుడు ఎక్కుడున్నాడో అని వెతుక్కుంటూ అతడి తల్లి పైన ఇంట్లో నుంచి కింద దుకాణంలోకి వచ్చింది.
తీరా దుకాణంలో లేకపోవడంతో అతని కోసం వెతికారు. వారికి అతడు కారులో స్పృహ కోల్పోయి కనిపించాడు. తర్వాత డూప్లికేట్ తాళాలతో కారు డోర్ తెరిచి, పిల్లాడిని ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. శుక్రవారమే బాలుడిని ఖననం చేయగా.. శనివారం ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బయటికి తీసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications