Begging: ఆ నగరంలో భిక్షాటన నేరం.. త్వరలోనే ఉత్తర్వులు!
Begging: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో భిక్షాటన చేయడం, దానధర్మాలు చేయడం త్వరలో నేరంగా పరిగణించబడుతుంది. కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ ఒకటి లేదా రెండు రోజుల్లో దానికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేయబోతున్నారు. ఇండియన్ సివిల్ ఢిఫెన్స్ కోడ్ 2023లోని సెక్షన్ 163 కింద ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు భోపాల్ కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ తెలిపారు. నగరంలో భిక్షాటన చేసేవారి కోసం ఒక షెల్టర్ ను రూపొందిస్తామని కలెక్టర్ వెల్లడించారు.
స్థలం కోసం మున్సిపల్ కార్పొరేషన్ ను కోరామని.. దానిని భిక్షగ్రాహ్ గా మారుస్తామన్నారు. స్థలాన్ని గుర్తించిన వెంటనే ఆర్డర్ జారీ చేయబడుతుందన్నారు. సంబంధిత స్థలం గురించి ఆర్డర్ లో తెలియజేస్తామన్నారు. అనంతరం ఉత్తర్వులు అమలులోకి వచ్చిన వెంటనే భోపాల్ లో భిక్షాటన చేయడంతో పాటు దానధర్మాలు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

భోపాల్‌లో 250 మంది యాచకులు
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో 250 మంది యాచకులు ఉన్నారని.. వారు మధ్యప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారని చెప్పారు. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా యాచకులను, వారికి భిక్ష పెట్టేవారిని గుర్తిస్తామని కలెక్టర్ తెలిపారు.
అంతే కాకుండా అధికారుల బృందాలు కూడా క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తాయని తెలిపారు. కూడళ్లలోని భిచ్చగాళ్లను ఓ షెల్టర్ కు చేర్చి.. అక్కడ వారికి బస ఏర్పాటు చేయడంతో పాటు ఆహారం, పానీయాలు అందిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో భిక్షాటనను అక్కడి అధికారులు బ్యాన్ చేశారు. యాచకులకు దానం చేయడం నేరంగా పరిగణిస్తారు.












Click it and Unblock the Notifications