వందే భారత్‌‌తో పోటీ: రాజధాని ఎక్స్‌ప్రెస్ రూపురేఖలు మారిపోయాయ్..!!

భువనేశ్వర్: రాజధాని ఎక్స్‌ప్రెస్ రూపురేఖలు మారిపోయాయి. న్యూ లుక్‌ను సంతరించుకుంటోన్నాయి ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లు. దశాబ్దాల కాలంగా ప్రయాణికులకు సేవలను అందిస్తోన్న ఈ రైలులో మరిన్ని సౌకర్యాలను కల్పించడంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ.. ఈ నిర్ణయం తీసుకుంది. దశలవారీగా అమలు చేయనుంది.

ఒడిశా రాజధాని భువనేశ్వర్- న్యూఢిల్లీ మధ్య రాకపోకలు సాగించే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు కొత్తగా తేజాస్ లుక్‌ను ఇచ్చారు రైల్వే అధికారులు. తేజాస్ రైళ్ల బోగీలను దీనికి అమర్చారు. ప్రయాణికుల కోసం ఇందులో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను మరింత అప్‌గ్రేడ్ చేశారు. దశలవారీగా అన్ని రాజధాని ఎక్స్‌ప్రెస్‌లకు కూడా తేజాస్ కోచ్‌లను అమర్చే అవకాశం ఉంది.

Bhuvaneswar-New Delhi Rajdhani gets Tejas look

తేజాస్ కోచ్‌లను అమర్చిన భువనేశ్వర్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. జెండా ఊపి ప్రారంభించారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి మంత్రులిద్దరూ హాజరయ్యారు. రైల్వే నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయబోతోన్నామని అన్నారు.

Bhuvaneswar-New Delhi Rajdhani gets Tejas look

సంబాల్‌పూర్ మార్గంలో రాకపోకలు సాగించే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు కూడా తేజాస్ బోగీలను అమర్చబోతోన్నామని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ కొత్త రైలు రాకపోకలు ప్రారంభిస్తుందని అన్నారు. క్రమంగా పశ్చిమబెంగాల్‌లోని ఆద్రా, జార్ఖండ్‌లోని టాటా మీదుగా ప్రయాణించే మరో రెండు రాజధాని రైళ్లకూ తేజస్ ర్యాక్స్ అమర్చబోతోన్నామని వివరించారు.

Bhuvaneswar-New Delhi Rajdhani gets Tejas look

వందే భారత్ తరహాలోనే ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు కూడా ఆటోమేటిక్ ఎంట్రన్స్ డోర్స్ ఉంటాయి. ప్రయాణికుల సమాచార వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. అన్ని బోగీల్లోనూ ఫైర్ అండ్ స్మోక్ డిటెక్షన్, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బయో టాయ్‌లెట్‌, వాక్యూమ్ అసిస్టెడ్ ఫ్లషింగ్, సుపీరియర్ టాయిలెట్ ఫిట్టింగ్స్, టచ్ ఫ్రీ సోప్ డిస్పెన్సర్, సీల్డ్ వెస్టిబ్యూల్స్‌ను ఇందులో అమర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+