మహిళలకు బంపర్ ఆఫర్: రంజాన్ పండుగ, 10 పైసలకే చీర, సృష్టి దృష్టి షాప్ కు క్యూ !
రంజాన్ పండుగ సందర్బంగా కర్ణాటకలోని బీదర్ లో చీరలు విక్రయించే ఓ షాప్ యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం రూ. 10 పైసలకే ఓ చీర విక్రయిస్తామని ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశారు.
బెంగళూరు: రంజాన్ పండుగ సందర్బంగా కర్ణాటకలోని బీదర్ లో చీరలు విక్రయించే ఓ షాప్ యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం రూ. 10 పైసలకే ఓ చీర విక్రయిస్తామని ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశారు.
రూ. 10 పైసలు, రూ. 20 పైసలు, రూ. 50 పైసలకు ఓ చీర అంటూ మూడు రకాల చీరలు విక్రయాలకు పెట్టడంతో మహిళలు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. అయితే అందులో షాప్ యజమాని ఓ చిన్న తిరకాసు పెట్టడంతో కొందరు మహిళలు నిరాశ చెందారు.

సృష్టి దృష్టి షాప్ లో !
కర్ణాటకలోని బీదర్ జిల్లా కేంద్రంలో సృష్టి దృష్టి అనే చీరల షాప్ ఉంది. ఈ షాప్ లో ఆకర్షనీయమైన, నాణ్యమైన చీరలు లభ్యం అవుతాయి. బీదర్ జిల్లాలో సృష్టి దృష్టి షాప్ కు ఓ ప్రత్యేక ఉంది. అతి తక్కువ ధరకు నాణ్యమైన చీరలు ఇక్కడ లభ్యం కావడంతో ఆ జిల్లాలోని చాల మంది మహిళలు ఇక్కడే చీరలు కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

గతంలో సంచలనం !
గతంలో సృష్టి దృష్టి షాప్ యాజమాన్యం కేవలం రూ. 20 కే ఒక చీర విక్రయించి సంచలనానికి తెరతీశారు. ఒక్క మహిళకు ఒకే చీర విక్రయించి కొన్ని వేల చీరలు విక్రయించి అందరినీ ఆకర్షించారు. ఇప్పుడు మరో సంచలనానికి సృష్టి దృష్టి షాప్ కేంద్రబిందువు అయ్యింది.

ఇదే తిరకాసు అంటే !
రంజాన్ పండుగ సందర్బంగా కేవలం రూ. 10 పైసలు, రూ. 20 పైసలు, రూ. 50 పైసలకు ఓ చీర అంటూ మూడు రకాల చీరలు విక్రయాలకు పెట్టారు. అయితే ఒక్క మహిళలకు ఒకే చీర విక్రయిస్తున్నారు. చీరలు కొనుగోలు చెయ్యాలంటే రూ. 10 పైసలు, రూ. 20 పైసలు, రూ. 50 పైసలు కాయిన్స్ ( బిల్లలు) మాత్రమే తీసుకురావాలని నియమాలు పెట్టారు.

ఆ కాయిన్స్ లేకపోతే !
సృష్టి దృష్టి షాప్ యాజమాన్యం నియమాల ప్రకారం 10 పైసలు, రూ. 20 పైసలు, రూ. 50 పైసలు బిల్లలు మాత్రమే తీసుకెళ్లి చీరలు కొనుగోలు చెయ్యాలి. రూపాయి బిల్లలు, ఇతర నోట్లు తీసుకెళ్లి చీరలు కొనుగోలు చెయ్యడానికి అవకాశం లేకపోవడంతో చాల మంది మహిళలు నిరాశగా వెనుతిరుగుతున్నారు.

పరుగో పరుగు
జూన్ 20వ తేదీ నుంచి జూన్ 25వ తేదీ వరకు సృష్టి దృష్టి షాప్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. బీదర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి దగ్గర 10 పైసలు, రూ. 20 పైసలు, రూ. 50 పైసలు బిల్లలు ఉండటంతో వాటిని తీసుకుని సృష్టి దృష్టి షాప్ దగ్గర క్యూకట్టారు. రూ. 350 విలువైన చీరలు కేవలం రూ. 10 పైసలకే విక్రయిస్తున్నారు.












Click it and Unblock the Notifications