బిగ్ అలెర్ట్ : రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
సెలవులంటే విద్యార్థులకు పండగే. పండుగలు, భారీ వర్షాలు వంటి కారణాల వల్ల ఇటీవల పాఠశాలలకు తరచుగా సెలవులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రేపు అంటే నవంబర్ 18, 2025 (మంగళవారం) కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. అయితే, ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా వర్తించదు, కేవలం వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం.
భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన భారీ వర్షపాతం హెచ్చరిక (ఆరెంజ్ అలర్ట్) కారణంగా తమిళనాడులోని అనేక జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ముఖ్యంగా, నవంబర్ 17న (సోమవారం) చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం వంటి జిల్లాల్లో వర్షాలు దంచికొట్టడంతో, ముందు జాగ్రత్త చర్యగా నవంబర్ 18న కూడా పలు జిల్లాల్లో పాఠశాలలు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నారు.

తమిళనాడు మినహా దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాల్లోని పాఠశాలలు మాత్రం యథావిధిగా తెరిచే ఉంటాయి. ఏపీ , తెలంగాణలోని పాఠశాలలకు నవంబర్ 18న ఎటువంటి సెలవు లేదు.
ఢిల్లీ NCR ప్రాంతంలో (ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్) రేపు పాఠశాలలు సాధారణంగా తెరిచి ఉంటాయి. ఇక్కడ వర్ష హెచ్చరికలు లేదా కాలుష్యానికి సంబంధించిన అదనపు సెలవులు ఏవీ ప్రకటించబడలేదు. బీహార్ , ఒడిశాతో సహా ఇతర రాష్ట్రాల్లో కూడా పాఠశాలలు సాధారణంగా నడుస్తాయి. విద్యార్థులు ,తల్లిదండ్రులు తమ ప్రాంతీయ పాఠశాల సెలవుల విషయంలో స్థానిక విద్యా శాఖ అధికారులు లేదా పాఠశాల యాజమాన్యం నుంచి వచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని సూచించారు.












Click it and Unblock the Notifications