చెన్నైలో హఠాత్తుగా కుంగిన రోడ్డు: తప్పిన పెను ప్రమాదం
తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ ప్రమాదం తప్పింది. మౌంట్ రోడ్డులో జెమిని ఫ్లై ఓవర్ సమీపంలో రోడ్డు (అన్నాశాలై రోడ్డు) అమాంతంగా కుంగిపోయింది. పెద్ద గొయ్యి ఏర్పడటంతో బస్సు, కారు అందులో దిగబడిపోయాయి.
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ ప్రమాదం తప్పింది. మౌంట్ రోడ్డులో జెమిని ఫ్లై ఓవర్ సమీపంలో రోడ్డు (అన్నాశాలై రోడ్డు) అమాంతంగా కుంగిపోయింది. పెద్ద గొయ్యి ఏర్పడటంతో బస్సు, కారు అందులో దిగబడిపోయాయి.

కుంగిన భూమి
ఈ ఘటనలో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భూమిలోకి దిగబడిన వాహనాలను వెలికి తీస్తున్నారు. రోడ్డు మరింత లోతుకు కుంగిపోతే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు చెప్పారు.
వారం రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు కుంగిపోయింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

అందుకే ప్రమాదం తప్పింది
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, మధ్యాహ్న సమయం కావడంతో వాహనాల రద్దీ అంత ఎక్కువగా లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళుతున్న వాహనాలు ఒక్కసారిగా భూమిలోకి దిగబడిపోవడంతో వాహన చోదకులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఇదే తొలిసారి కాదు
ఈ రోడ్డు కుంగిపోవడం ఇదేమి తొలిసారి కాదు. వారం రోజుల క్రితం కూడా ఇటువంటి సంఘటన జరిగింది. ఆ రోడ్డు కింద పైపు లైన్ ఉండటంతో ఈ సంఘటనలు పునరావృతం అవుతున్నాయని, ఈ విషయమై అధికారులు దృష్టి సారించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద ప్రమాదం తప్పింది
చెన్నైలోని అన్నాశాలై రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు, కారు రోడ్డులోకి దిగబడిపోయాయి. అయితే, అందులోని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. ఈ రోజు మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది.

వెలుపలకు తీశారు
రోడ్డులో కుంగిపోయిన బస్సును, కారును క్రేన్ సహాయంతో వెలుపలకు తీశారు. తొలుత కారు, ఆ తర్వాత బస్సు కుంగిపోవడంతో.. కారు పూర్తిగా లోనికి వెళ్లింది. ఆ వెనుక బస్సు ఉంది. వీటిని బయటకు తీశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications