Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Target 2024:బెంగళూరు కేంద్రంగా విపక్షాల భేటీ...ఏ పార్టీలు కలుస్తున్నాయ్..?

బెంగళూరు: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొవటానికి కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇదే ఆలోచనలతో ఉన్న దేశంలోని 24 పార్టీలను కలుపుకుని ముందుకు సాగాలని నిర్ణయించింది. వీరందరితో సోమవారం కర్ణాటకలోని బెంగళూరులో రెండు రోజుల కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీనికి ముందు జూన్ 23న బీహార్‌లోని పాట్నాలో మెుదటి సమావేశం తర్వాత ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా మరోసారి పార్టీల చర్చలకు వేదిక ఏర్పడింది.

Big

ఈసారి తొమ్మిది పార్టీలు అదనంగా చేరనుండగా, ఈ సభ ప్రతిపక్ష ఐక్యతకు ఊతమిచ్చేదిగా పరిగణించబడుతోంది. జాతీయ స్థాయిలో ఉమ్మడి కార్యక్రమాలకు సంబంధించిన ఆందోళనలు, రాబోయే పార్లమెంట్ సమావేశాలపై వ్యూహం, ఇతర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. విపక్షాల సమావేశంపై మినిట్ టు మినిట్ లైవ్ అప్ డేట్స్ మీకోసం..

Jul 17, 2023, 10:08 pm IST

విపక్షాల భేటీ అనంతరం సమావేశం ప్రాంగణం నుంచి బయటికి వెళుతున్న నేతలు.
Jul 17, 2023, 10:07 pm IST

సామాజిక న్యాయం కోసం సారూప్యత కలిగిన విపక్ష పార్టీలన్నీ కలిసి పనిచేస్తాయని భేటీ అనంతరం మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు.
Jul 17, 2023, 8:18 pm IST

బెంగళూరులో కొనసాగుతున్న విపక్షాల భేటీ. దాదాపు 26 పార్టీలకుపైగా నేతలు హాజరయ్యారు.
Jul 17, 2023, 8:16 pm IST

విపక్షాల భేటీకి హాజరయ్యేందుకు వచ్చిన బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్.
Jul 17, 2023, 8:15 pm IST

బెంగళూరు చేరుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్.
Jul 17, 2023, 8:14 pm IST

బెంగళూరు చేరుకున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్.
Jul 17, 2023, 8:12 pm IST

విపక్షాల భేటీకి బెంగళూరు చేరుకున్న ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా.
Jul 17, 2023, 8:11 pm IST

బెంగళూరు చేరుకున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.
Jul 17, 2023, 8:08 pm IST

ఢిల్లీలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేజ్రీవాల్ బెంగళూరులో రాజకీయాలు చేసేందుకు వెళ్లారని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా.
Jul 17, 2023, 8:06 pm IST

విపక్షాల భేటీకి హాజరయ్యేందుకు బెంగళూరు వచ్చిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎంపీ అభిషేక్ బెనర్జీ. స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
Jul 17, 2023, 3:24 pm IST

విపక్షాల భేటీ కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, స్వాగతం పలికిన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
Jul 17, 2023, 3:20 pm IST

ఢిల్లీ వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల సమావేశానికి హాజరవుతున్నారు. దీనిపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా బాధ్యత వహించడంలేదు. అలాంటి పార్టీలు దేశానికి దిశానిర్దేశం చేయగలవా,కచ్చితంగా చేయలేవు: బీజేపీ నేత రవిశంకర్
Jul 17, 2023, 12:34 pm IST

విపక్షాల భేటీ ప్రజల కోసం జరుగుతోంది. ప్రజావాణి వినిపించేందుకు జరుగుతోంది. 9ఏళ్ల బీజేపీ పాలనపై ప్రజలు విరక్తి చెంది ఉన్నారు. వారి గొంతును వినిపించి రాజ్యాంగంను పరిరక్షించేందుకు చేస్తున్న ప్రయత్నమిది: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
Jul 17, 2023, 12:32 pm IST

కర్నాటకలో ఎలా అయితే బీజేపీ తుడుచుపెట్టుకుపోయిందో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా నామరూపాలు లేకుండా పోతుంది: కర్నాటక మంత్రి ఈశ్వర్ ఖాండ్రే
Jul 17, 2023, 11:01 am IST

తమలో ఒక భాగంగా జేడీఎస్ పార్టీని ఎప్పుడూ విపక్షపార్టీలు భావించలేదు. అదే సమయంలో ఎన్డీయే నుంచి కూడా తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని స్పష్టం చేసిన కర్నాటక మాజీ సీఎం జేడీఎస్ అధినేత కుమారస్వామి
Jul 17, 2023, 10:53 am IST

బెంగళూరు విపక్షాల భేటీలో చాలా అంశాలు చర్చకు వస్తాయి. ఈవీఎంలు, లోక్‌సభ సీట్ల కేటాయింపు,ఫ్రంట్ పేరులాంటి అనేక అంశాలపై చర్చించడం జరుగుతుంది: సంజయ్ రౌత్
Jul 17, 2023, 10:39 am IST

వీసీకే నేత తిరుమవలవన్ బెంగళూరుకు చేరుకున్నారు. ఈ రోజు జరిగే విపక్షాల భేటీలో సింగిల్ అజెండా. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడమే తమ లక్ష్యమన్న తిరుమవలవన్
Jul 17, 2023, 10:13 am IST

కాంగ్రెస్ నేతృత్వంలో సమావేశం కానున్న విపక్షాలు
Jul 17, 2023, 10:12 am IST

నేడు బెంగళూరులో విపక్షాల సమావేశం

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+