ట్రంప్ తో విడాకుల వేళ.. ఎలాన్ మస్క్ కు మోడీ బంపర్ ఆఫర్..!

నిన్న మొన్నటి వరకూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో రాసుకుపూసుకుని తిరిగి తాజాగా తీవ్రంగా విభేదిస్తున్న ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు భారత ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. ట్రంప్ తో విభేదాల కారణంగా అమెరికాలో తీవ్ర నష్టాలు చవిచూస్తున్న మస్క్..ఇప్పుడు భారత్ లో తన వ్యాపార విస్తరణ కోసం గతంలో ఇచ్చిన ఓ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.

శాటిలైట్ ఆధారంగా టెలికాం, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు వీలుగా ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ భారత్ లో లైసెన్స్ కోసం రెండేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకుంది. అయితే జాతీయ భద్రతతో సహా వివిధ సమస్యల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యం అయింది. రెండేళ్ల తర్వాత ఇవాళ దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. స్టార్ లింక్ సేవలు భారత్ లో ప్రారంభించేందుకు వీలుగా కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ లైసెన్స్ మంజూరు చేసింది. దీంతో త్వరలోనే స్టార్ లింక్ సేవల్ని భారత్ లో ప్రారంభించేందుకు మస్క్ సిద్దమవుతున్నారు.

big relief to elon musk in india after cutting off relations with Donald trump

భారత్ లో ఇలా ఉపగ్రహం ద్వారా టెలికాం సేవల కోసం లైసెన్స్ తీసుకున్న మూడో కంపెనీగా స్టార్ లింక్ అవతరించనుంది. ఇప్పటికే రిలయన్స్ జియోతో పాటు యూటెల్ శాట్ యొక్క వన్ వెబ్ కూడా ఇలా లైసెన్స్ లు తీసుకున్నాయి. దీంతో స్టార్‌లింక్ ఇప్పుడు తన ఉపగ్రహ నెట్‌వర్క్‌ను ఉపయోగించి భారతదేశంలో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడానికి సిద్దమవుతోంది. మరోవైపు అమెజాన్ ఉపగ్రహ ప్రాజెక్ట్ కైపర్ కూడా కేంద్రం నుంచి ఇలాంటి లైసెన్స్ కోసమే ఎదురుచూస్తోంది.

తాజాగా భారత్ లో టెలికాం స్పెక్ట్రమ్ కేటాయింపుల్ని వేలం ద్వారానే చేయాలని రిలయన్స్ జియో పట్టుబట్టినా కేంద్రం మాత్రం ఎలాన్ మస్క్ సంస్ధ స్టార్ లింక్ కోరుకున్నట్లుగానే బిడ్డింగ్ లేకుండా నేరుగా కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇప్పుడు స్టార్ లింక్ లైసెన్స్ కూడా పొందడంతో భారత్ లో అతిపెద్ద ఉపగ్రహ టెలికాం సేవల సంస్ధగా అవతరించేందుకు కూడా అవకాశం దొరకబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+