శృంగారానికి మూడ్ లేదన్నందుకే ఇదింతా..!
పూణేలో సంచలనం సృష్టించిన ఓ రేప్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ఫ్లాట్‌కు వచ్చిన డెలివరీ బాయ్ పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని, తన ఫోన్‌లో సెల్ఫీ తీసుకుని మళ్లీ వస్తానని బెదిరించి వెళ్లాడని ఓ 22 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో తీవ్ర కలకలం రేగగా, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. యువతి ఇంటికి వచ్చింది డెలివరీ బాయ్ కాదని, ఆమెకు సన్నిహితుడైన స్నేహితుడేనని తేలింది. వీరిద్దరూ తరచుగా కలుస్తుంటారని, శారీరక సంబంధం కూడా ఉందని పోలీసుల విచారణలో వెల్లడైంది.

సంఘటన జరిగిన రోజు, యువతి సోదరుడు ఆఫీసుకు వెళ్లగానే ఆ స్నేహితుడు వచ్చాడు. శృంగారంలో పాల్గొనమని బలవంతం చేయగా, యువతికి మూడ్ లేదని నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన యువతి, పోలీసులకు ఫోన్ చేయగా, వారు వచ్చేలోపే నిందితుడు పారిపోయాడు.
పోలీసులు మరింత లోతుగా విచారించగా, యువతి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఈ కట్టుకథ అల్లినట్లు స్పష్టమైంది. బాధితురాలు, నిందితుడి కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉన్నాయని, యువతికి ఆరోగ్య సమస్యలు, కొద్దిగా మతి భ్రమించే స్థితి ఉందని నిందితుడి తరపు వారు పోలీసులకు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంతో పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు ఫిర్యాదు చేసి విచారణను పక్కదోవ పట్టించినందుకు యువతిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications