వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bigg Boss 14:సల్మాన్ ఖాన్ పారితోషికంపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: కంటెస్టెంట్లకు భారీగా రెమ్యునరేషన్

|
Google Oneindia TeluguNews

ముంబై: సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న హిందీ బిగ్ బాస్-14 రియాల్టీ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు బయటపడ్డాయి. అంతేకాదు ఫ్యాన్స్ కూడా ఎవరెవరికి నిర్వాహకులు ఎంతెంత ఇస్తున్నారో అనేదానిపై క్యూరియాసిటీతో ఉన్నారు. అయితే బిగ్‌బాస్ హిందీ కంటెస్టెంట్లు వారానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఓ లుక్కేద్దాం.

 ముగ్గురు సీనియర్ల పారితోషికం అదుర్స్

ముగ్గురు సీనియర్ల పారితోషికం అదుర్స్

ఇప్పటి వరకు తెలుగు బిగ్‌బాస్ షో కంటెస్టెంట్లకు సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే వారు ఎంత తీసుకుంటున్నారో అనేదానిపై మాత్రం ఎక్కడా కచ్చితంగా ఎవరూ చెప్పలేదు. తాజాగా హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు బయటకొచ్చాయి. అయితే సిద్ధార్థ్ శుక్లా, హీనా ఖాన్, గౌహర్ ఖాన్, రుబీనా దిలాయిక్, ఇజాజ్ ఖాన్, జాస్మిన్ భాసిన్, అభినవ్ శుక్లా, నిక్కీ తంబోలీ, పవిత్ర పూనియా, షెహజాద్ డియోల్‌ వేతనాలు వెలుగులోకి వచ్చాయి. ఇక హౌజ్ నుంచి తాజాగా ఎగ్జిట్ ఇచ్చిన షెహజాద్ డియోల్‌ది చాలా తక్కువ వేతనం ఇచ్చినట్లు సమాచారం.ఇక రుబీనా దిలాయిక్‌కు అత్యధిక పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్‌బాస్ సీనియర్లుగా పిలువబడుతున్న సిద్ధార్థ్ శుక్లా, గౌహర్ ఖాన్, హీనా ఖాన్‌లను అధిక మొత్తానికే కాంట్రాక్ట్ సైన్ చేసినట్లు సమాచారం.

 సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారట

సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారట

ఇదిలా ఉంటే షో హోస్ట్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ‌కు ఎంత పారితోషికం ఇస్తున్నారనేదానిపై కూడా స్పష్టత లేదు. అయితే ఈ సారి బిగ్‌బాస్ షో హోస్టింగ్‌ కు తక్కువగానే పారితోషికం తీసుకుంటున్నట్లు సల్మాన్ ఖాన్ చెప్పాడు. కరోనావైరస్‌‌తో ఛానెల్ నష్టాల్లో ఉన్నందున తాను భారీ పారితోషికం తీసుకుని ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టివేయడం తనకు ఇష్టం లేదని కండలవీరుడు సల్మాన్ ఖాన్ చెప్పాడు. ఇక కరోనా సమయంలో షో చేస్తే చాలామందికి సహాయం చేసినవారం అవుతామని సల్మాన్ ఖాన్ చెప్పాడు. ఇక సీనియర్ బిగ్ బాస్ కంటెస్టెంట్లలో సిద్ధార్థ్ శుక్లా రూ.32 లక్షలు తీసుకుంటుండగా, హీనా ఖాన్ రూ.25 లక్షలు, గౌహర్ ఖాన్ రూ.20 లక్షలు పారితోషికం తీసుకుంటున్నారు.

 ఎవరెవరిది ఎంత పారితోషికం..?

ఎవరెవరిది ఎంత పారితోషికం..?

ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న 14 మంది కంటెస్టెంట్ల పారితోషికం వివరాలు ఇలా ఉన్నాయి.వీరందరికీ నిర్వాహకులు వారం లెక్కన రెమ్యూనురేషన్ అందిస్తున్నారు.

షెహజాద్ డియోల్: రూ.50 వేలు
జాన్ కుమార్ సాను: రూ.80 వేలు
రాహుల్ వైద్య : రూ.లక్ష
నిక్కి తంబోలి: రూ. 1.2 లక్షలు
పవిత్ర పూనియా : రూ. 1.5 లక్షలు
అభినవ్ శుక్లా: రూ.1.5 లక్షలు
ఇజాజ్ ఖాన్ : రూ.1.8 లక్షలు
నిశాంత్ సింగ్ మల్కానీ: రూ.2 లక్షలు
సారా గుర్పాల్ : రూ.2 లక్షలు
జాస్మిన్ భాసిన్ : రూ.3 లక్షలు
రుబీనా దిలాయిక్ : రూ. 5లక్షలు

మొత్తానికి రుబీనా దిలాయిక్ అత్యధికంగా వారానికి రూ. 5 లక్షలు తీసుకుంటుండగా అత్యల్పంగా షెహజాద్ డియోల్ వారానికి రూ. 50 వేలు తీసుకున్నారు. అయితే షెహజాద్, సారా గుర్పాల్‌లు ఇప్పటికే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

English summary
Salman Khan hosted Bigg boss season 14 is running succesfully. A news have comeout about the contestants remuneration per week. Shehzad bounty is less while Rubina's remuneration is the highest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X