Bigg Boss effect ? : నటుడు, దర్శకుడు విచిత్ర ప్రవర్తన.. హోటల్ వద్ద కారుపై దాడి...
కొడగు : అతనో నటుడు, దర్శకుడు కూడా.. బిగ్‌బాస్‌లో కూడా పాల్గొన్నాడు.. ఇంకేం కావాలి.. జనానికి బాగా తెలుసు ... జనంలోకి వస్తే చర్చించుకుంటారు. ఫోటోలు తీసుకుంటారు. సరదాగా ఉండాలి. ఓపికతో మాట్లాడాలి. కానీ ఎవరి మీద కోపం తీస్తామంటే ఎలా ... కర్ణాటకలో ఓ నటుడు రియల్ లైఫ్‌లో రెచ్చిపోయాడు. అతి చేస్తున్నాడని గమనించిన స్థానికులు దేహశుద్ది చేయడంతో తిక్క కుదిరినట్లైంది.

వింత, విచిత్రం ..
హుచ్చా వెంకట్ .. కన్నడు నటుడు, కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. కన్నడ బిగ్ బాస్ సీజన్‌లో పాల్గొన్నాడు. ఇదీ ఈయన గురించిన ఇన్పో .. వెంకట్ కొడగులోని ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడున్న వారు నటుడు వచ్చాడని ఎగబడి మరీ చూశారు. చూస్తారు కూడా. కానీ ఇదీ మనోడికి నచ్చలేదు. ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. వింతగా ప్రవర్తించాడు. పూనకం వచ్చినట్టు చేశాడు.

కారుపై దాడి ..
అభిమానులు చూస్తుంటే ఒక్కసారిగా బయటకొచ్చాడు వెంకట్. అక్కడున్న వారిపై ఒకింత ఆగ్రహాం వ్యక్తం చేశాడు. అక్కడే ఉన్న ఓ కారుపై రాళ్లు విసిరాడు. దీంతో ఆ కారు అద్దాలు పగిలిపోయాయి. కారు డోర్‌ను కూడా పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. నటుడు వెంకట్ ప్రవర్తన చూసి అక్కడున్న జనాలు బిత్తరపోయారు. ఇక లాభం లేదనుకొని రంగంలోకి దిగారు. అతడిని పట్టుకొని దేహశుద్ది చేశారు. వారు బఢిత పూజ చేయడంతో .. మనోడు సోయిలోకి వచ్చినట్టున్నాడు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వారు రాగానే అప్పగించారు.

రీల్ .. రియల్
ఓ హీరో తాను రీల్ లైఫ్ లాగా రియల్ లైఫ్‌లో ప్రవర్తించి .. జనాల చేతిలో దెబ్బలు తిన్నాడు. ఇంతకీ అతనలా ఎందుకు చేశాడు. ఇటీవల బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవడం వల్లనేనా అనే చర్చ జరుగుతుంది. ఆటలో గెలుపు ఓటములు సహజం .. కానీ ఎలిమినేట్ అయ్యానని ... విచిత్రంగా ప్రవర్తించాడు. తాను ఓడిపోయానని వింతగా ప్రవర్తించి .. అభిమానుల చేతనే తన్నులు తిన్నాడు. చివరికీ పోలీసులకు చిక్కి .. జైలు పాలయ్యాడు. రంగుల ప్రపంచం నుంచి వచ్చి ... అధ:పాతాళానికి పడిపోతున్నాననే భ్రమలో కటకటలాపాలయ్యాడు వెంకట్.
-
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications