బిగ్ బాస్ రియాలిటీ షో సెట్ లో అగ్నిప్రమాదం, బూడిద, రూ. కోట్లలో నష్టం, ఈ సీజన్ అంతే!
Recommended Video

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలోని ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలోని కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షో సెట్ అగ్నిప్రమాదంలో కాలి బూడిద అయ్యింది. బిగ్ బాస్ రియాలిటీ షో సెట్ బూడిద కావడంతో రూ. కోట్ల రూపాయలలో నష్టం వచ్చిందని నిర్వహకులు అంటున్నారు.

హీరో సుదీప్
బహుబాష నటుడు, దర్శకుడు, ఈగ ఫేం సుదీప్ కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షో వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో 5వ సీజన్ కోసం బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలో ఉన్న ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలో రూ. కోట్ల వ్యయంతో భారీ సెట్ నిర్మించారు.

ప్రతిసీన్ కు మార్పులు
బిడిదిలోని ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలోని కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షో సెట్ లో ప్రతిసీన్ కు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షో ఐదవ సీజన్ సెట్ కు మరమత్తులు చేస్తున్నారు.

వేకువ జామున !
గురువారం వేకువ జామున 3 గంటల సమయంలో బిగ్ బాస్ రియాలిటీ షో సెట్ లో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. విషయం గుర్తించిన ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీ సిబ్బంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

12 వాహనాలు
బెంగళూరు, రామనగర, బిడిది నుంచి 12 వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చెయ్యడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో మరన్ని అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థానికి చేరుకున్నాయి.

75 శాతం బూడిద
కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షో సెట్ దాదాపు 75 శాతం కాలి బూడిద అయ్యింది. విద్యుత్ షార్ట్ సర్యూట్ వలన మొదట బిగ్ బాస్ రియాలిటీ షో సెట్ లోని మ్యూజియంకు మంటలు వ్యాపించాయని, తరువాత సెట్ మొత్తం వ్యాపించాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications