మృత్యుంజయుడు ఈ శివమ్: 5 గంటల తర్వాత బోర్ బావి నుంచి సురక్షితంగా మూడేళ్ల బాలుడు
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృత్యుంజయుడిగా నిలిచాడు. దాదాపు 40 అడుగుల లోతులోని బోరు బావిలో పడిన ఆ చిన్నారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అవిశ్రాంతంగా ఐదు గంటలపాటు శ్రమించి కాపాడాయి. బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని ఎన్డీఆర్ఎఫ్ అధికారి రంజిత్ కుమార్ వెల్లడించారు.
#WATCH | The child is fine and has been rescued. He has been sent to hospital. It took us around 5 hours to rescue him, says Ranjeet Kumar, NDRF officer, Nalanda, Bihar pic.twitter.com/nPyMGwuHYT
— ANI (@ANI) July 23, 2023
బోరుబావి నుంచి బయటికి తీసిన వెంటనే ఆ బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. దాదాపు ఐదు గంటలపాటు శ్రమించి బాలుడిని కాపాడినట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారి వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

నలంద జిల్లాలోని కుల్ గ్రామంలో మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోపోయాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు బాలుడిని రక్షించేందుకు జేసీబీ యంత్రాలతో బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు చేశారు.
బాలుడికి ఆక్సిజన్ అందేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. పైపుల ద్వారా ఆక్సిజన్ అందజేశారు. ఐదు గంటలపాటు అవిశ్రాంతంగా శ్రమించిన సహాయక బృందాలు చివరకు ఆ బాలుడిని కాపాడాయి. దీంతో అధికారులు, సిబ్బంది ఎంతో ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకుని అభినందనలు పంచుకున్నారు. ఇక ఆ బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేశారు. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు ఎంతో కృషి చేసిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నారిని శివమ్ కుమార్‌గా గుర్తించారు. కాగా, బోరు వేసి ఇలా మూసివేయకుండా ఉంచడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో దేశంలోని చాలా చోట్ల ఇలాంటి బోరు బావుల్లో పడి పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. అయినప్పటికీ.. ఇలాంటి బోరుబావుల ఘటనలు జరుగుతుండటం శోచనీయం. ప్రభుత్వాలు, అధికారులు ఇలాంటి బోరుబావులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications