తేలనున్న 3577 మంది బీహర్ నేతల భవితవ్యం, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్త్..
బీహర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 38 జిల్లాల్లో గల 55 సెంటర్లలో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 9 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతోంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న బ్యాలెట్ బాక్సులు ఉంచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లను మొహరించింది.
Recommended Video
రాష్ట్రంలో 12 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మూడు విడతల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 57 శాతం ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన 3 వేల 755 మంది నేతల భవితవ్యం ఇవాళ తేలనుంది. ఈ ఎన్నికల్లో నితీశ్ కుమార్ పోటీ చేయలేదు. ఎందుకంటే ఆయన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్నారు. కానీ ఆయన 12 మంత్రులు సహా, స్పీకర్ బరిలో ఉన్నారు.

పాట్నా సాహిబ్ నుంచి నంద్ కిశోర్, మోటిహరి నుంచి ప్రమోద్ కుమార్, మదుబన్ నుంచి రన రందీర్, ముజఫర్ నగర్ నుంచి సురేశ్ శర్మ, నలందా నుంచి శ్రావణ్ కుమార్, దినారా నుంచి జై కుమార్ సింగ్, జెహనాబాద్ నుంచి కృష్ణనందన్ ప్రసాద్ వర్మ బరిలో ఉన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈవీఎంల వద్ద, బూతుల వద్ద ప్రికాషన్స్ తీసుకున్నారు.
ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీహరీలు మహగడ్ బందన్ కూటమికి మొగ్గుచూపుతారని లెక్కలు కట్టాయి. ఎన్డీఏ కూటమికి పరాజయం తప్పదని చెప్పాయి. అయితే మెజార్టీ పోల్స్ మాత్రం హంగ్ కూడా ఏర్పడే అవకాశం ఉందని తెలిపాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications