Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాన్ ఇండియా: తెలంగాణ నుంచి బిహార్ దాకా: 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు: బీజేపీ పట్టు

బిహార్: ప్రస్తుతం బిహార్‌లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొన్ని చోట్ల పూర్తయింది. ఉత్తరాది రాజకీయాల్లో ఇరుసుగా చెప్పుకొనే బిహార్ సహా వేర్వేరు రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో తన పట్టు నిలుపుకొంది. కొన్ని కొత్త స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు, అటు పశ్చిమం నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకూ 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కౌంటింగ్ నడుస్తోంది. పాన్ ఇండియాా ఎన్నికలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.

Recommended Video

    Counting of votes for 58 Assembly by-polls across 11 states

    బిహార్‌ను మినహాయిస్తే.. ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా, తెలంగాణల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఆయా రాష్ట్రాల్లో మొత్తం 58 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించారు. వాటిల్లో 40 చోట్ల బీజేపీ ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇందులో కొన్నింటిని తన ఖాతాలో వేసుకుంది కూడా. తెలంగాణలో దుబ్బాకలో ఘన విజయాన్ని అందుకుంది. అధికార టీఆర్ఎస్‌ను ఓడించింది. కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగిన రాజరాజేశ్వరి నగర, శిరాల్లో గెలుపొందింది.

    Bihar Assembly Election Results 2020: Pan India elections exhibits the BJP credibility

    బిహార్‌లో బీజేపీ పరిస్థితి హోరాహోరీగా సాగుతోంది. తొలుత ఆధిక్యతలోకి దూసుకెళ్లిన బీజేపీ ఆధిక్యత మళ్లీ తగ్గుముఖం పట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రీయ జనతాదళ్‌కు ఊపిరిపోసినట్టయింది. గుజరాత్‌లో ఎనిమిదికి ఎనిమిది, ఉత్తర ప్రదేశ్‌లో ఎనిమిదికి ఎనిమిదింటినీ బీజేపీ గెలుచుకోగలిగింది. కర్ణాటకలో రెండు స్థానాలకు రెండింటిలోనూ కమలనాథులు విజయం సాధించారు. నాగాలాండ్, మణిపూర్‌లల్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాల్లో 22 చోట్ల కాషాయ జెండా ఎగిరింది. దీన్ని బట్టి చూస్తే.. పాన్ ఇండియాగా సాగిన ఈ ఎన్నికల్లో బీజేపీ తన పట్టును నిలుపుకొందనేది స్పష్టమౌతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+