గర్ల్ ఫ్రెండ్ కామన్: కొడుకును సమర్థించిన ముఖ్యమంత్రి

 Bihar Chief Minister defends son's alleged sexual escapade with policewoman
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ శనివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఒక మహిళా పోలీసుతో కలిసి ఒక హోటల్‌లో డీలక్స్ సూట్‌ను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం జితన్ రామ్, ఆ ఘటనను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.

ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఎవరుంటున్నారని ప్రశ్నించారు. ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ ఉండవచ్చునని, తన కుమారుడు తప్పు చేశాడని చెప్పేందుకు ఎలాంటి సాక్ష్యం లేదని ఆయన అన్నారు. హోటల్ సీసీటీవీ ఫుటేజిలో కూడా ఏమీ ఆధారాలు లభ్యం కాలేదు కదా? అని ఎదురు ప్రశ్నించారు.

భారతీయ జనతా పార్టీ ఆరోపణలు నిరాధారమన్నారు. నేటి కాలంలో గర్ల్ ఫ్రెండ్ ఉండడం సర్వసాధారణమైపోయిందన్నారు. బీజేపీ దళితుల పైన రాజకీయ కక్షసాధింపు, కుట్రలకు పాల్పడుతోందన్నారు. కాగా, మహిళపై వేధింపుల వ్యవహారం నుంచి కుమారుడిని మాంఝీయే తప్పించారని బీజేపీ ఆరోపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+