వ్వూహకర్త రుణం: క్యాబినెట్ హోదా

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ (యూ) నేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజయంలో కీలకపాత్ర పోషించిన రాజకీయ వ్వూహకర్త ప్రశాంత్ కిశోర్ కు కీలకపదవి దక్కింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సలహాదారుగా ప్రశాంత్ కిశోర్ ను నియమించారు.

రాజకీయ వ్వూహకర్త ప్రశాంత్ కిశోర్ కు క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పించారు. బీహార్ లో జేడీ (యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ మహా కూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్బంగా నితీష్ కుమార్ ప్రచార బృందాన్ని ప్రశాంత్ కిశోర్ పర్యవేక్షించారు.

Bihar Chief Minister Nitish Kumar advisor Prashant Kishor

నితీష్ కుమార్ మరో సారి బీహార్ ముఖ్యమంత్రి కావడానికి శక్తి వంచనలేకుండా కృషి చేశారు. మారుమూల ప్రజలు, ముఖ్యంగా యువత దగ్గర అయ్యేలా ప్రచార వ్వూహాలు రూపొందించడంతో ప్రశాంత్ కిశోర్ కీలకపాత్ర పోషించారు.

సోషల్ మీడియాను ఉపయోగించుకుని యువత దగ్గర అయ్యేలా ఆకర్షించారు. గతంలో 2014 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే తరపున నరేంద్ర మెడీ విజయానికి ప్రశాంత్ కిశోర్ కృషి చేశారు. అనంతరం పార్టీలో అమిత్ షా సరైన స్థానం కల్పించకపోవడంతో బయటకు వచ్చి నితీష్ కుమార్ విజయానికి కృషి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+