మనిషి ఎత్తు 5 అడుగులకు కారణం అదే: బీహార్ సీఎం
న్యూఢిల్లీ: యువతీ యువకుల వివాహ వయసు 25 సంవత్సరాలు ఉండాలని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీ పేర్కొన్నారు. బీహార్‌లోని పాట్నాలో 'జనతా కే దర్బార్ మీ ముఖ్యమంత్రి' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పురాతన ఆశ్రమ పద్దతుల ప్రకారం స్త్రీ, పురుషులిద్దరికీ 25 ఏళ్లు వచ్చిన తర్వాత వివహం చేస్తే ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని, మహిళల్లో పోషకాహారలోపం తదితర సమస్యలు ఉండవని అన్నారు.
పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రస్తుతం భారత దేశ చట్టం ప్రకారం వివాహ వయస్సు స్త్రీకి 18 ఏళ్లు, పురుషుడికి 21ఏళ్లు. 25 ఏళ్లు వచ్చాకే పెళ్లి చేసుకుంటే మంచిదని తన అభిప్రాయాన్ని తెలిపారు. తాను 25 ఏళ్లు దాటాకే పెళ్లి చేసుకున్నానని ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీ విలేకరుల సమావేశంలో చెప్పారు.

మన వయసుని బట్టి ఆశ్రమ పద్దతిలో నాలుగు స్టేజిలు ఉన్నాయని చెప్పారు. మొదటి స్టేజి బ్రహ్మచర్యం. ఇది 24ఏళ్ల వరకు ఉంటుంది. రెండవ స్టేజి గ్రిహస్త. ఇది 24-48 వరకు ఉంటుంది. మూడో స్టేజి వనప్రస్ద. ఇది 48 - 72 వరకు ఉంటుంది. చివరి స్టేజి సన్యాస. ఈ స్టేజి 72 నుంచి చనిపోయేంత వరకు ఉంటుందన్నారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం వల్లనే భారతదేశంలో సగటు మనిషి ఎత్తు 7 అడుగుల నుంచి 5 అడుగులకు తగ్గిందని అన్నారు.












Click it and Unblock the Notifications