అమిత్ షా నోట కాబోయే ప్రధాని మాట

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఇవ్వాళ బిహార్‌లో పర్యటిస్తోన్నారు. శ్రీరామ నవమి పండగ వేళ నిర్వహించిన శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు చెలరేగిన రెండో రోజే ఆయన అక్కడ అడుగు పెట్టారు. నవడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా శాంతి నెలకొనాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శించారు.

శాంతి భధ్రతలను నెలకొల్పే విషయంలో ఇక్కడి ప్రభుత్వంతో చర్చించి ఏ మాత్రం ఉపయోగం లేదని అమిత్ షా అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను దించుతున్నామని పేర్కొన్నారు. అల్లర్లు చెలరేగిన ససారం పట్టణానికి తాను వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. దురదృష్టకర పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని చెప్పారు. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయని, పోలీసులు ప్రజలపై టియర్ గ్యాస్‌, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తోన్నారని అన్నారు.

Bihar CM Nitish Kumar wont become Prime Minister, predicts MoH Amit Shah

బిహార్ లో జంగిల్ రాజ్ నడుస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిహార్‌లో శాంతి స్థాపన కుదురుతుందా? అని ప్రశ్నించారు. నితీష్ కుమార్ అధికార దాహంతోనే రాష్ట్రీయ జనతాదళ్‌తో పొత్తు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ మహాకూటమి ప్రభుత్వాన్ని తాము ఓడించి తీరుతామని అమిత్ షా పేర్కొన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రధానమంత్రి కావాలని నితీష్ కుమార్ ఇప్పటి నుంచే కలలు కంటున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదని అమిత్ షా అన్నారు. నితీష్ కుమార్ ఎప్పటికీ ప్రధాని కాలేడని జోస్యం చెప్పారు. నరేంద్ర మోదీ ఈ దేశానికి వరుసగా మూడోసారి ప్రధానంత్రి అవుతారని తేల్చి చెప్పారు. కాబోయే ప్రధాని ఎవరనే విషయాన్ని ఇప్పటికే దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. బిహార్‌లోని అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో కమలం వికసిస్తుందని అన్నారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో మళ్లీ చేరుతామంటూ నితీష్ కుమార్ కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) నాయకులు తమకు సంకేతాలను పంపిస్తోన్నారని అమిత్ షా వెల్లడించారు. ఎన్డీఏలో చేరికకు జేడీయూకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయాయని చెప్పారు. 2024 ఎన్నికల తరువాత నితీష్ కుమార్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+