సీత కష్టం: ‘రామ, లక్ష్మణులపై సాక్షులు, ఆధారాలేవి?’
పాట్నా: సీతాదేవిని అడవులకు పంపించి కష్టపెట్టారని రామలక్ష్మణులపై వేసిన పిటిషన్‌పై సోమవారం బీహార్‌లోని సీతామర్హి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాముడు సీతను కష్టపెట్టాడనడానికి సాక్ష్యమేది? ఆ ఘటనకు ఇప్పుడు ఎవరిని శిక్షించాలి? అని జడ్జి పిటిషన్‌దారుడిని ప్రశ్నించారు.
సీతాదేవిని కష్టపెట్టారని, నిజానిజాలు తెలుసుకోకుండా అడవులకు పంపించారని ప్రాక్టీస్ లాయర్ ఠాకూర్ చందన్ కుమార్ సింగ్.. కోట్లాదిమంది ప్రజలు దైవంగా పూజించే రాముడు, లక్ష్మణులపై పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా? లేదా? అనే అంశంపై సోమవారం సీతామర్హి కోర్టు విచారణ చేపట్టింది. ఇలాంటి పురాతన అంశాలపై కేసు ఎందుకు పెట్టావు? అని పిటిషన్ వేసిన వ్యక్తిని అడిగింది.

‘ఘటనకు సాక్షులు ఉన్నారా..? సీతను రాముడు ఏ తేదీన అడవులకు పంపించాడో పిటిషన్‌లో పేర్కొనలేదేంటి? నీ ఫిర్యాదుకు ఆధారం ఏంటి?' అని పిటిషన్ దాఖలు చేసిన చందన్ కుమార్‌ను జడ్జి ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు.
ఈ కేసు విచారణకు అనర్హం అని, ఇందులో ఎలాంటి తర్కం లేదని జడ్జి కేసును కొట్టేశారు.
అయితే పిటిషన్‌దారు మాత్రం తాను సీతాదేవికి న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని తెలిపారు.
బీహార్‌లోని మిథిలా కూతురైన సీతాదేవికి న్యాయం జరగాలని అర్థిస్తున్నానని చందన్ కుమార్ కోర్టులో జడ్జిని కోరారు. ఆమె ఎలాంటి తప్పు చేయకపోయినా గర్భిణిగా ఉన్న సమయంలో అన్యాయంగా రాముడు అడవులకు పంపించారని చెప్పారు. భర్త మాట జవదాటని భార్యను ఇలా అడవులపాలు జేసి ఆమెను కష్టపెట్టడం సరైనది కాదని తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications