కూతురిపై రేప్.. అడ్డుకున్న తల్లి.. ఇద్దరికి గుండు గీయించిన వార్డు మెంబర్

వైశాలి : బీహార్‌లో వార్డు మెంబర్ రెచ్చిపోయాడు. ప్రజాప్రతినిధిననే విషయం మరచి కామాంధుడిలా ప్రవర్తించాడు. పైగా ఇద్దరు మహిళలను ఘోరంగా అవమానించాడు. వైశాలి జిల్లాలోని బీహారి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం నాడు వార్డు మెంబర్ మహ్మద్ ఖుర్షిద్ కొందరు వ్యక్తులతో కలిసి అదే గ్రామానికి చెందిన ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో తల్లీకూతుళ్లు మాత్రమే ఉన్నారు. ఖుర్షిద్ ఆ ఇంట్లో ఉన్న 19 ఏళ్ల యువతిపై బలవంతంగా అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. సదరు యువతి తల్లి కూడా వారిని అడ్డగించింది.

నన్నే ఎదిరిస్తారా అంటూ వార్డు మెంబర్ ఆగ్రహావేశాలకు గురయ్యాడు. మీ అంతు చూస్తా అంటూ రెచ్చిపోయాడు. తల్లీకూతుళ్లకు గుండు కొట్టించడమే గాకుండా గ్రామంలో ఊరేగించాడు. అక్కడితో అతడి కోపం చల్లారలేదు. కాసేపటి తర్వాత తన అనుచరగణంతో మళ్లీ బాధితుల ఇంటికి వచ్చి నానా రచ్చ చేశాడు.

Bihar daughter and mother tonsured and paraded for resisting rape

అత్యాచారం అడ్డుకున్నందుకే మీకు ఈ శిక్ష అంటూ బూతులు తిడుతూ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించాడు. తల్లీకూతుళ్లను కర్రలతో కొడుతూ బయటకు తీసుకొచ్చారు. వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అందరూ చూస్తుండిపోయారే కనీసం ఎవరూ కూడా ఆపే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది.

మొత్తానికి పోలీసులకు సమాచారం అందడంతో వారు రంగంలోకి దిగారు. వార్డు మెంబర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులకు గాను మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదలావుంటే సదరు వార్డు మెంబర్ ఖుర్షిద్ పై యువతుల అక్రమ రవాణాలు పలు కేసులున్నట్లు తేల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+