మేం రెడీ: డిప్యూటీ సీఎం తేజస్వికి 44వేలమంది అమ్మాయిలు పెళ్లి ఆఫర్
పాట్నా: బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు 44 వేల పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. గత ఎన్నికల్లో గెలుపొంది గెలిచిన తేజస్వి.. నితీష్ కుమార్ కేబినెట్లో డిప్యూటీగా ఉన్నారు. ఎక్కడైనా సమస్యలు వస్తే ఫోన్ చేయాలని ఆయన నెంబర్ ఇస్తే.. సమస్యకు బదులు పెళ్లి చేసుకోమంటూ ప్రపోజల్స్ వస్తున్నాయి.
షాకింగ్ విషయం ఏమంటే, వాట్సాప్ ద్వారా 44వేలకు పైగా ప్రపోజల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని అధికారులు చెప్పారు. ప్రియ, అనుపమ, మనీష, కంచన్, దేవిక.. ఇలా మొత్తం అంత మంది అమ్మాయిలు ఆయన ఓకే అంటే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని చెప్పారు.

ఆ నెంబరుకు 47 వేల సందేశాలు వచ్చాయని, అందులో 44వేలు పెళ్లికి సంబంధించినవేనని, మూడువేల సందేశాలు మాత్రమే రోడ్ల గురించి ఉన్నాయని అధికారులు చెప్పారు. తమ శరీర కొలతలు, రంగు, ఎత్తు లాంటి వివరాలను కూడా వారు సందేశంలో ఉంచారు.
కొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. తేజస్వి మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కొడుకు. ఆ నెంబర్ తేజస్వి సొంత నెంబర్ అనుకొని మెసేజీలు పెట్టారు.
తాను బ్రహ్మచారిని కాబట్టి సరిపోయిందని, పెళ్లి అయి ఉంటే తాను పీకల్లోతు కష్టాల్లో మునిగేవాడినని తేజస్వి సరదాగా అన్నారు. తాను పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని చెప్పారు. సోషల్ మీడియాను తేజస్వి బాగా ఉపయోగిస్తారు.












Click it and Unblock the Notifications