బీహార్ పోలింగ్ ప్రశాంతం: అత్యధికం చంపారన్
పాట్నా: బీహార్‌లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 243 నియోజకవర్గాలకు గానూ నాలుగో దశలో 55 నియోజక వర్గాల్లో ఆదివారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 776 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కోటిన్నర మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మధ్యాహ్నం మూడు గంటలకు 52.42శాతం పోలింగ్ నమోదైంది. అంతక ముందు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో 48.37శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 42.94శాతం పోలింగ్ నమోదైంది. అంతక ముందు మధ్యాహ్నం 12 గంటల వరకు 35.68శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నాం రెండు గంటల సమయంలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది.

* పశ్చిమ చంపారన్ - 50.73 శాతం
* తూర్పు చంపారన్ - 50.27 శాతం
* శియోహర్ - 47.70 శాతం
* సిత్మర్హి - 49.72 శాతం
* ముజఫర్‌పూర్ - 49.34 శాతం
* గోపాల్‌గంజ్ - 46.07 శాతం
* సివాన్ - 42.63 శాతం
बिहार विधानसभा चुनाव के चौथे चरण के मतदान में सभी मतदाताओं और विशेषकर युवाओं से भारी संख्या में मतदान की अपील करता हूँ ।
— Narendra Modi (@narendramodi) November 1, 2015 Polling begins for 4th phase of #BiharPolls: Voters lined up outside a polling booth in Muzaffarpur. pic.twitter.com/GfeVYy8S67
— ANI (@ANI_news) November 1, 2015 











Click it and Unblock the Notifications