Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసెంబ్లీలో హైడ్రామా మధ్య బలపరీక్ష: చివరి నిమిషంలో ప్రతిపక్షం నుంచి ముగ్గురు సభ్యులు అవుట్

Bihar floor test: బిహార్‌ రాజకీయాల కథ సుఖాంతమైంది. అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. ఈ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోగలిగారు.

కిందటి నెలలో జేడీయూ- రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహా ఘట్‌బంధన్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఎన్డీఏ కూటమిలో చేరారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తనకు మద్దతు ఇవ్వనున్న జేడీయూ, బీజేపీ- దాని మిత్రపక్షాల శాసన సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు.

Bihar floor test: CM Nitish Kumars govt wins as 129 MLAs support him

243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 122. జేడీయూకు 45 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి ఉన్న 78, దాని మిత్రపక్షం హిందుస్తాన్ ఆవామీ లీగ్-4 స్థానాలను కలుపుకొంటే ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకోగలుగుతుంది.

జేడీయూ, బీజేపీ, ఆవామీ లీగ్‌కు చెందిన 127 మంది సభ్యులు.. నితీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించారు. ఆయనకు మద్దతుగా లేఖలు ఇచ్చారు. దీనితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏను ఆహ్వానించారు గవర్నర్. తొమ్మిదో సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారాయన.

సభలో తన బలాన్ని నిరూపించుకోవడానికి గవర్నర్ 10 రోజులు గడువు ఇచ్చిన నేపథ్యంలో.. నేడు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించారు. స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీని వాడివేడిగా చర్చ సాగింది. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మాట్లాడారు. ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సభలో బలాన్ని నిరూపించుకున్నంత మాత్రాన ప్రజల్లో ఆదరణ పొందినట్లు కాదని తేజస్వి యాదవ్ విమర్శించారు. అయిదు సంవత్సరాల కాలపరమితిలో ఒకే వ్యక్తి వేర్వేరు పార్టీల తరఫున మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దేశ చరిత్రలోనే లేదంటూ విమర్శించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.

Bihar floor test: CM Nitish Kumars govt wins as 129 MLAs support him

అనంతరం నితీష్ కుమార్ మాట్లాడారు. బిహార్ ప్రజల కోసమే తాను మహాఘట్‌బంధన్ కూటమి నుంచి బయటికి వచ్చానని, వారి కోరిక మేరకే ఎన్డీఏలో చేరానని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలనూ క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందిస్తానని చెప్పారు.

అనంతరం ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. మొత్తం129 మంది సభ్యులు నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఇందులో బీజేపీ-78, జేడీయూ- 45, హిందుస్తాన్ ఆవామీ లీగ్-4, ఇతరులు ఒకరు ఉన్నారు. రాష్ట్రీయ జనతాదళ్- 79, కాంగ్రెస్-19, వామపక్షాలు- 16, ఏఐఎంఐఎం- ఒక సభ్యుడు.. నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

స్పీకర్ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. నిజానికి- ఫ్లోర్ టెస్ట్‌కు ముందు ఎన్డీఏ కూటమి బలం 127 మాత్రమే. బలపరీక్ష ప్రారంభ సమయానికి ఇది 129కి పెరిగింది. ఆర్జేడీ సభ్యులు చేతన్ ఆనంద్, నీలం ఆనంద్, ప్రహ్లాద్ యాదవ్.. చివరి నిమిషంలో పార్టీ ఫిరాయించారు. అధికార పక్షం వైపు కూర్చున్నారు వారు ముగ్గురు కూడా నితీష్‌కు మద్దతు ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+